twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరణం తర్వాత రియా అకౌంట్లోకి భారీగా డబ్బు.. డ్రగ్స్‌ దందాలో నగదు బదిలీలు లీక్

    |

    బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దూకుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. ఆ వివరాల గురించి.. ..

    రియా చక్రవర్తి అకౌంట్లపై ఈడీ నజర్

    రియా చక్రవర్తి అకౌంట్లపై ఈడీ నజర్

    డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తులో రెండు భారీ మొత్తాలు క్వాన్, రియా చక్రవర్తి అకౌంట్ల మధ్య జరిగాయి. ఆ వివరాలపై ఈడీ ఆరా తీయాలనుకొంటున్నది. ఏప్రిల్, జూలైలో జరిగిన నగదు ట్రాన్స్‌ఫర్లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే విషయాన్ని రిపబ్లిక్ టెలివిజన్ బయటపెట్టింది.

    క్వాన్, రియా మధ్య భారీగా క్యాష్ ట్రాన్స్‌ఫర్స్

    క్వాన్, రియా మధ్య భారీగా క్యాష్ ట్రాన్స్‌ఫర్స్

    రియా చక్రవర్తి, క్వాన్ సంస్థల మధ్య పలుమార్లు నగదు ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. తొలిసారి మార్చి 12వ తేదీన ఆర్టీజీఎస్ ద్వారా 3,96,825 రూపాయలు, ఏప్రిల్ 21వ తేదీన 3,68,098, మే 2వ తేదీన రూ. 1,60,651, నాలుగో చెల్లింపు మే నెలలోనే రూ.1,72,126, ఐదో చెల్లింపు జూన్ 4వ తేదీన చెక్ రూపంలో 1,59,300 రూపాయలు డిపాజిట్ అయ్యాయి.

    భారీ మొత్తాలపై

    భారీ మొత్తాలపై

    జూన్ 14 సుశాంత్ మరణం తర్వాత జూన్ 25, జూలై 4, జూలై 6, అక్టోబర్ 4, నవంబర్ 18వ తేదీన వరుసగా రూ. 2,75,400, రూ. 1,36,802, రూ. 2,75,400, రూ. 1,17,900 and రూ.1,21,125 క్వాన్ సంస్థ అకౌంట్ నుంచి రియా అకౌంట్లోకి డిపాజిట్ అయ్యాయనే విషయాన్ని రిపబ్లిక్ టీవీ తన కథనంలో వెల్లడించింది.

    సుశాంత్ మరణానికి ముందు తర్వాత

    సుశాంత్ మరణానికి ముందు తర్వాత

    సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత రియా చక్రవర్తి, క్వాన్ సంస్థల మధ్య నెఫ్ట్ ద్వారా క్యాష్ ట్రాన్స్‌ఫర్ జరిగింది. మార్చి 12వ తేదీన ఆర్టీజీఎస్ ద్వారా 3,96,825 రూపాయలు ఏప్రిల్ 21వ తేదీన 3,68,098, జూలై 4వ తేదీన 1,36,802 రూపాయలు రియా అకౌంట్లోకి వచ్చాయి. ఈ నగదు బదిలీలపై ఈడీ దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    రియాకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ

    రియాకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ

    ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరులకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    English summary
    bollywood actress Rhea Chakraborty Arrested By NCB After 19 hours of grilling, Rhea Chakraborty has been arrested by the Narcotics Control Bureau on Tuesday in the drugs case linked to the death of actor Sushant singh Rajput case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X