సల్మాన్ ఖాన్‌ను ఇరిటేట్ చేసిన మహిళా అభిమాని.. అతడి దగ్గరకెళ్లి ఏం చేసిందో చూడండి

భారతదేశంలో ఉన్న హీరోల్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఎంతో ప్రత్యేకం అని చెబుతుంటారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ సీనియర్ హీరోకు మగ అభిమానులతో పాటు భారీ స్థాయిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సల్మాన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ అభిమానులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి అదే ఆయనను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. గతంలో ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది.

సల్మాన్ ఖాన్ - మాధురీ దీక్షిత్ కాంబినేషన్‌లో సూరజ్ తెరకెక్కించిన చిత్రం 'హమ్ ఆప్కే హై కౌన్'. ఈ సినిమా విడుదలై ఆగస్టు 4తో పాతికేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఇటీవల ముంబైలో ప్రత్యేక షోను వేశారు. దీనికి సల్మాన్, మాధురితో పాటు చాలా మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఇక, సెలెబ్రిటీలు వస్తున్నారని తెలియడంతో చాలా మంది ప్రేక్షకులు కూడా ఆ షో చూసేందుకు వచ్చారు. కానీ, ఎవరికీ ఎంట్రీ లేకపోవడంతో వారంతా బయటే ఉండిపోయారు.

Lady Fan Pull Salman Khan In Hum Aapke Hain Koun Special Show

ఇక, షో ముగిసిన తర్వాత స్టార్స్ అంతా బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళా అభిమాని నేరుగా సల్మాన్ ఖాన్ దగ్గరుకు వెళ్లిపోయింది. అతడితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. దీనికి సల్మాన్ సహకరించకపోవడంతో, అతడి చేయి పట్టుకుని తన వైపునకు లాక్కుంది. దీంతో ఇరిటేట్ అయిన సల్లూ భాయ్.. ఆమె నుంచి చేయి విదుల్చుకుని కోపంగా వెళ్లిపోయాడు. ఆ వెంటనే అతడి బాడీ గార్డ్స్ ఆమెను పక్కకు లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X