రియా చక్రవర్తితో మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్వీట్స్.. ఫోటో వైరల్!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతుండగానే కొన్ని మీడియా సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తుండటంపై మంచు లక్ష్మీ నిరసన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిలో రియా చక్రవర్తికి మద్దతు తెలిపిన వారిలో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటారు. తాజాగా రియా చక్రవర్తిపై పనిగట్టుకొని దాడి చేస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆమె ట్విట్టర్‌లో ఘాటుగా స్పందింంచారు. ఈ క్రమంలో రియాతో కలిసి ఉన్న ఫోటో వైరల్‌గా మారిన నేపథ్యంలో..

రియా చక్రవర్తిని ఓ రాక్షసిలా

రియా చక్రవర్తిని ఓ రాక్షసిలా

సుశాంత్ మరణంపై చట్టం తన పని తాను చేసుకొంటూ పోతుంటే రియా చక్రవర్తిని ఓ రాక్షసిలా మీడియా చూపిస్తున్నది. గ్రామాల్లో మంత్రగత్తెను వెటాడినట్టు రియాను మీడియా వేటాడింది. అందుకే తాను స్పందిస్తున్నాను. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో రియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని లక్ష్మీ మంచు అన్నారు.

 రియాపై క్రూరమైన దాడి అంటూ

రియాపై క్రూరమైన దాడి అంటూ

దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా సుశాంత్ సూసైడ్‌, రియా చక్రవర్తి అంశాలను ఎంచుకొని క్రూరమైన దాడిని చేస్తున్నారని లక్ష్మీ మంచు అసంతృప్తిని వెళ్లగక్కారు. మీడియా అంతా ఏకమై దాడి చేస్తున్న సమయంలో రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి అండగా నిలువాలని అనుకొంటున్నాను. ఒకరికి అండగా నిలువాలంటే చాలా రకాలుగా ఆలోచించుకోవాల్సి వస్తుందని లక్ష్మీ మంచు అన్నారు.

 కరోనావైరస్ పీడిస్తున్నా.. రియాపైనే

కరోనావైరస్ పీడిస్తున్నా.. రియాపైనే

రియా చక్రవర్తి అరెస్ట్ నేపథ్యంలో లక్ష్మీ మంచు మరో ట్వీట్ చేశారు. దేశాన్ని కరోనావైరస్ పట్టి పీడిస్తున్నా ప్రజలకు పట్టింపు లేదు కానీ, సుశాంత్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగి ఉన్నారంటూ ఓ గ్రాఫ్‌ను షేర్ చేసింది. కరోనా గురించి బెంగ పడుతున్న వారు తక్కువ శాతం ఉంటే.. సుశాంత్ గురించి ఆలోచించే వారి శాతం ఎక్కువగా ఉందని ఆమె ఆ గ్రాఫ్‌ను చూపించారు.

సుగాలి ప్రీతిపై మంచు లక్ష్మీకి బెంగ ఇలా అంటూ

సుగాలి ప్రీతిపై మంచు లక్ష్మీకి బెంగ ఇలా అంటూ

అయితే మంచు లక్ష్మీ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ అక్కకు రియా గురించి 95 శాతం బెంగ ఉంటే.. సుగాలి ప్రీతి గురించి మాత్రం 5 శాతం మాత్రమే ఉంది అని ట్వీట్ చేశారు. అలాగే మరో నెటిజన్ ఆహరం విషయం తక్కువ ఆందోళన ఉంటే.. డ్రగ్స్ గురించి ఎక్కువ పట్టింపు ఉన్నట్టు ఉందని కామెంట్లను విసురుతున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 రియాతో మంచు లక్ష్మీ, రకుల్ ఫోటో వైరల్

రియాతో మంచు లక్ష్మీ, రకుల్ ఫోటో వైరల్

రియా చక్రవర్తికి మద్దతుగా నిలువడంపై నెటిజన్లు తప్పుపడుతూ దారుణంగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రియా చక్రవర్తితో కలిసి ఉన్న మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్, ఇతర సెలబ్రిటీ ఫోటోను ట్యాగ్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X