రియా చక్రవర్తిపై అంత క్రూరమైన దాడా? మీడియాపై మండిపడ్డ లక్ష్మీ మంచు, విద్యాబాలన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై సినీ తారలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు ట్విట్టర్‌లో సుదీర్గమైన పోస్ట్ ద్వారా స్పందిస్తే.. దానికి విద్యాబాలన్ ప్రతి స్పందన ను వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం కేసును మీడియాలో సర్కస్‌గా మారిందంటూ విద్యాబాలన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి ట్వీట్లు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : రియా ను రాక్షసిలా మార్చారు..మా సపోర్ట్ తనకే..! || Oneindia Telugu
రియాను ఓ రాక్షసిలా

రియాను ఓ రాక్షసిలా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుపై ఈడీ, సిబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఇండియాటుడే ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించారు. ఈ విషయంపై లక్ష్మీ మంచు స్పందిస్తూ.. రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో రియా చక్రవర్తి ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూపై స్పందించాలా? వద్దా అనే విషయంపై మల్లగుల్లాలు పడ్డాను. రియాను మీడియా ఓ రాక్షసిగా మారుస్తున్న నేపథ్యంలో మౌనంగా ఉండటం ఇష్టంలేక స్పందించాల్సి వచ్చింది అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

సుశాంత్ కేసులో వాస్తవాలు నిజాయితీగా

సుశాంత్ కేసులో వాస్తవాలు నిజాయితీగా

సుశాంత్ మరణం వెనుక వాస్తవాలేమిటో నాకు తెలియదు. కానీ నేను నిజాలను తెలుసుకోవాలనుకొంటున్నాను. నిజాయితీ మార్గంలో వాస్తవాలు బయటకు వస్తాయని అనుకొంటున్నాను. సుశాంత్ మరణం కేసులో ఆయన కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని లక్ష్మీ మంచు తన పోస్టులో పేర్కొన్నారు.

రియాపై దాడిని ఖండిస్తున్నా

రియాపై దాడిని ఖండిస్తున్నా

అయితే వాస్తవాలు బయటకు తెలియని సమయంలో రియాను, ఆమె కుటుంబాన్ని దారుణంగా, అత్యంత క్రూరంగా దాడి చేయడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. సోకాల్డ్ మీడియా ట్రయల్స్‌తో వారు ఎంత బాధపడుతున్నారో నేను అర్ధం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితులే నాకు ఎదురైతే నేను నా సహచరుల మద్దతును కోరుకొంటాను. ఈ పరిస్థితుల్లో రియాను ఒంటరిగా వదిలివేయకుండా అండగా నిలువాలని కోరుకొంటున్నాను అని లక్ష్మీ మంచు తన పోస్టులో తెలిపారు.

రియా చక్రవర్తికి నా మద్దతు

రియా చక్రవర్తికి నా మద్దతు

ఏదైనా జరిగితే మనం ఎలా వ్యవహరిస్తామనే విషయం నాకు బాధను కలిగిస్తున్నది. ఏదైనా విషయంపూ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే మనకు ఎంత తెలుసు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. కొన్ని విషయాలపై మాట్లాడటానికి మనం మరొకరిపై ఆధారపడాల్సి వస్తున్నది. నాతోటి నటి రియాకు నేను అండగా నిలుస్తున్నాను అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.

భేష్ లక్ష్మి మంచు.. విద్యాబాలన్ సపోర్ట్

భేష్ లక్ష్మి మంచు.. విద్యాబాలన్ సపోర్ట్

రియా చక్రవర్తికి అండగా నిలువాలని నిర్ణయం తీసుకొన్న మంచు లక్ష్మిని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పొగడ్తలతో ముంచెత్తారు. ధైర్యంగా రియాకు అండగా నిలువడాన్ని అభినందిస్తున్నాను. సుశాంత్ కేసును మీడియా ఓ సర్కస్‌గా మార్చింది. రియా చక్రవర్తిని ఈ కేసులో బలి పశువును చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా నేరం రుజువు కానంత వరకు ప్రతీ ఒక్కరు అమాయకులే. విచారణ జరుగుతున్నప్పుడు.. చట్టాలు తమ పనిని తాము చేసుకెళ్తున్నప్పుడు మనం వాటిని గౌరవించాలి అని విద్యాబాలన్ పోస్టులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X