Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆఫర్ ఇచ్చి అమీర్ ఖాన్ అలా ఇరిటేట్ చేశాడు.. సైఫ్ సర్దుకుపోమ్మన్నాడు.. కరీనా కపూర్
బాలీవుడ్లో అగ్రతారలు అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్‌కు పండుగే. గతంలో వీరిద్దరి జోడి 3 ఇడియెట్స్లో హిట్ అవ్వడంతో మళ్లీ కరీనా, అమీర్ కలిసి నటిస్తే చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ల కలయికకు అవకాశం లాల్ సింగ్ చద్దా రూపంలో వచ్చింది. 1994లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికరమైన విషయాలను కరీనా బయటపెట్టింది. హీరోయిన్గా అవకాశం రావడానికి ఆమె ఏం చేశారంటే..
లాల్ సింగ్ చద్దాలో కరీనాకు
ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా లాల్ సింగ్ చద్దా మూవీలో ఫారెస్ట్ గంప్ పోషించిన పాత్రను అమీర్ ఖాన్ చేస్తున్నారు. అలాగే ఆ సినిమాలో రాబిన్ రైట్ పోషించిన పాత్ర కోసం కరీనా కపూర్‌ను అమీర్ ఖాన్ అనుకొన్నారు. కానీ అగ్రతార అయినప్పటికీ అంత సులభంగా ఇవ్వలేదట. రకరకాలుగా పరీక్షించి ఆమెకు అమీర్ రోల్ ఆఫర్ చేసినట్టు తాజా ఇంటర్వ్యూలో కరీనా వెల్లడించింది.
అమీర్ పిలుపుతో చాలా ఉత్సాహంగా
ఇటీవల ప్రముఖ చానెల్‌తో కరీనా మాట్లాడూతూ.. లాల్ సింగ్ చద్ధా ఆఫర్ గురించి అసలు విషయాన్ని బయటపెట్టింది. అమీర్ ఖాన్ ఎంత నిక్కచ్చిగా ఉంటారో గురించి అందరికీ తెలుసు. 100 శాతం ఫర్ఫెక్షన్ కోసం చూస్తాడు. అలాంటి అమీర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పటికే నేను లాల్ సింగ్ చద్దా గురించి విన్నాను. నాకు పిలుపు రావడంతో ఎక్సైటింగ్ అయ్యాను అని కరీనా తెలిపింది.
కొన్ని సీన్లు ఇచ్చి ఆడిషన్
అమీర్ పిలువడంతో వెళ్లి కలిశాను. అప్పుడు నాకు స్క్రిప్టు వినిపించాడు. కొన్ని సీన్లను చదివాడు. అలాగే కొన్ని సీన్లను చదవమని అడిగాడు. ఆయన చెప్పిన ప్రకారమే చేశాను. కానీ నా జీవితంలో ఇలా స్క్రిప్టు పట్టుకొని ఆడిషన్ ఇవ్వలేదు. ఇదేంటి ఇలా చేస్తున్నాడు. నాకు ఆడిషన్ ఏమిటని ఇరిటేట్ అయ్యాను. ఓ దశలో చేయాలా? వద్దా అనుకొన్నాను. కానీ ఆ తర్వాత రియలైజ్ అయి అందులో తప్పేమీ అనిపించలేదు అని చెప్పింది.
అమీర్ కరెక్టే నని సైఫ్
అమీర్ చేసిన పని సరైందే అనిపించింది. ఎందుకంటే సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచి మారిపోతున్నది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా వెండితెర దేవతను అనుకొంటే నేను వెనుకపడి పోవడం తప్పనిసరి అనే ఫీలింగ్ కలిగింది. సైఫ్ కూడా అందులో తప్పులేదని, ఫారెస్ట్ గంప్ సినిమా షూట్ సమయంలో అల్ పసీనోకు కూడా ఆడిషన్ నిర్వహించారనే విషయాన్ని తెలుసుకొని కంగుతిన్నాను అని కరీనా చెప్పింది.