twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar: ఆమె 200కోట్ల ఆస్తి ఎవరికి దక్కబోతోందంటే.. క్లారిటీ ఇవ్వనున్న లాయర్లు!

    |

    గానకోకిల లతా మంగేష్కర్ గత ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. గాయానికి భారతదేశ సంగీత ప్రపంచంలో ఎనలేని కీర్తిని గడించిన ఆ గాయని మరణం తీరని లోటు అనే చెప్పాలి. లతా మంగేష్కర్ పాడిన పాటలు ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్. ఇక ఆమె కేవలం సంగీత గాయనిగా సంపాదించిన ఆస్తి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె పెళ్లి చేసుకోలేదు. మరి వారసులు ఎవరు అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంలో త్వరలోనే లతా మంగేష్కర్ ఆస్తులకు సంబంధించిన లాయర్లు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

    అలా బ్రతికే ఉంటారు..

    అలా బ్రతికే ఉంటారు..

    ఏ రంగంలో అయినా ఏకాగ్రత క్రమశిక్షణతో కొనసాగితే ప్రపంచం మనల్ని ఒక విజేతగా చేస్తుందని లతా మంగేష్కర్ నిరూపించారు. సంగీత ప్రపంచంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న ఆమె సంగీతం ఉన్నంత కాలం కూడా పాటల రూపంలో బ్రతికే ఉంటారని చెప్పవచ్చు. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్పారు. కానీ ఆమె లోటును మాత్రం ఎవరు తీర్చలేనిది అని ప్రధాని సైతం ఎమోషనల్ అయ్యారు.

     50 వేలకు పైగా పాటలు..

    50 వేలకు పైగా పాటలు..


    లతా మంగేష్కర్ తన 60 ఏళ్ళ సంగీత ప్రయాణంలో దాదాపుగా 30కి పైగా భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా 1942లో ఒక మరాఠీ సినిమా ద్వారా ఆమె సింగర్ గా జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక మొదట్లోనే మంచి గుర్తింపు లభించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు అన్ని రకాల పాటలను కూడా పాడారు. అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అనే చెప్పాలి.

    ఆస్తులు ఎంతంటే?

    ఆస్తులు ఎంతంటే?

    కేవలం సింగర్ గానే లతా మంగేష్కర్ భారీగా ఆస్తులను సంపాదించుకున్నారు. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 200కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఆమె పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తన కుటుంబ సభ్యులకు అలాగే చిత్ర పరిశ్రమలో పేద కళాకారులకు కూడా చాలాసార్లు సహాయం చేశారు. కొత్త సింగర్స్ కు కూడా అవకాశాలు వచ్చేలా చాలాసార్లు హెల్ప్ చేశారు.

    వారసులు ఎవరు?

    వారసులు ఎవరు?

    ఇక ఆమె ఆస్తులు ఎవరికి సొంతం అవుతాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ఆమె ఆస్తులు ఎవరు చూసుకుంటారు? అసలు ఆమె ఎవరికి విలునామ రాశారు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ముంబైలో అలాగే చెన్నైలో లతా మంగేష్కర్ కు సంబంధించిన కొన్ని స్థావరాలు బంగ్లా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

     ఎవరికి దక్కుతాయి?

    ఎవరికి దక్కుతాయి?

    ఈ విషయంలో త్వరలో లతాజీ లాయర్లు ప్రకటన చేయబోతున్నారని ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి ఒక టాక్ వినిపిస్తోంది. లతా జీ తన తండ్రి పేరు మీద ట్రస్ట్‌ను నడుపుతోంది. ఇక ఆమె ఆస్తి మొత్తం ట్రస్ట్‌కు వెళ్తుందని అంటున్నారు. ఇలా పలు ఊహాగానాలు సాగుతుండగా.. ఈ ఆస్తులు ఎవరికి ఎప్పుడు దక్కుతాయో అనే ఉత్కంఠ నెలకొంది.

    Recommended Video

    Lata Mangeshkar జ్ఞాపకార్థం సంతాప దినాలు.. గాన కోకిల లతా మంగేష్కర్‌ | Oneindia Telugu
    లతా కుటుంబ సభ్యులు..

    లతా కుటుంబ సభ్యులు..

    ఇక లతా మంగేష్కర్ కుటుంబంలో ముగ్గురు సోదరీమణులు ఉండగా ఒక సోదరుడు ఉన్నారు. ఇక వారికి చాలా సందర్భాల్లో లతా మంగేష్కర్ సహాయం కూడా చేశారు. కానీ ఈ ఆస్తికి వారసులయ్యే అదృష్టవంతులు ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే వీడలేదు. మరి ఆ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు..

    English summary
    Lata Mangeshkar assets value who will inherit her 200 crore property
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X