కియారా అద్వానీ ‘లస్ట్’ సీన్: లతా మంగేష్కర్ పాటపై అభ్యంతరం!
కియారా అద్వానీ నటించిన 'లస్ట్ స్టోరీస్' మూవీలోని స్వయంతృప్తి సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సీన్ మీద వివాదం నెలకొంది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫ్యామిలీ ఈ సీన్ బ్యాగ్రౌండ్‌లో వాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సీన్.... కొత్తగా పెళ్లయిన దంపతుల సెక్స్ లైఫ్ ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. భర్త వల్ల సరైన లైంగిక తృప్తి పొందని భార్య ఎలక్ట్రిక్ వైబ్రేటర్ ఉపయోగించి స్వయంతృప్తి పొందడం ఇందులో చూపించారు.

అతా మంగేష్కర్ ఫ్యామిలీ అభ్యంతరం
స్వయంతృప్తి పొందే పాత్రలో కియారా అద్వానీ నటించారు. అయితే ఈ సీన్ బ్యాగ్రౌండ్లో ‘కభి ఖుషి కభి గమ్' మూవీ టైటిల్ ట్రాక్ ప్లే చేయడంపై లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అంత పవిత్రమైన పాటను ఇలాంటి సీన్లో వాడటం ఏమిటి అంటూ గుర్రుగా ఉన్నారు.

లతాజీకి తెలిస్తే బాధ పడతారు
‘తాను పాడిన పాటను ఇలా అపవిత్రం చేశారనే విషయం లతాజీ దృష్టికి తీసుకుపోదలుచుకోలేదు. ఈ వయసులో ఆమెకు ఈ విషయం తెలిస్తే మరింత బాధ పడతారు. ఏసియాలోనే గొప్ప సింగర్‌గా పేరుగాంచిన లతాజీ పాడిన భజన లాంటి పాటను దర్శకుడు ఎందుకు ఇలాంటి సీన్లలో వాడారో అర్థం కావడం లేదు. ఇంకా వేరే ఏదైనా పాట వాడి ఉండొచ్చు కదా' అని మంగష్కర్ ఫ్యామిలీకి చెందిన ఒకరు వ్యాఖ్యానించారు.

అణచివేయబడ్డ లైంగిక కోరికల చుట్టూ
మధ్యతరగతి మహిళల చుట్టూ ‘లస్ట్ స్టోరీస్' కథ తిరుగుతుంది. ఇందులో కియారా అద్వానీ కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా నటించింది. ఈ తరం అమ్మాయిలు అణచివేయబడిన తమ లైంగిక కోరికలను తీర్చుకోవడాని సెక్స్ టాయ్, వైబ్రేటర్స్ ఉపయోగిస్తున్నారనే విషయాన్ని ఇందులో ఫోకస్ చేశారు.

లస్ట్ స్టోరీస్
లస్ట్ స్టోరీస్ అనేది ఒక ఆంథాలజీ(సంపుటి) చిత్రం. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ మాదిరిగానే ఇది ఓ రకమైన సినిమా. ఈ చిత్రానికి జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. 120 నిమిషాల నిడివిగల ఈ సినిమాలో ఈ నలుగురు డైరెక్టర్లు ఒక్కో పార్ట్‌కు డైరెక్షన్ చేశారు. కియారా అద్వానీ, రాధిక ఆప్టే, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాలా, విక్కీ కౌశల్, నేయిల్ భూపాలమ్, నేహా ధూపియా, సంజయ్ కపూర్, ఆకాష్ తోసర్ లాంటి ప్రముఖులు నటించారు.


Click it and Unblock the Notifications











