రణవీర్, దీపిక పదుకొనె వివాహానికి సెల్ ఫోన్లు బంద్!
బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పదుకొనె, రణవీర్ త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్ గా వివాహం చేసుకోవాలని దీపిక పదుకొనె, రణవీర్ నిర్ణయించుకున్నారట. అతిధులుగా ఆహ్వానించే వారిని కూడా వివాహానికి సెల్ ఫోన్లు అనుమతించబోవడం లేదని తెలుస్తోంది. ప్రైవేట్ గా వివాహం జరిగిపోవాలని దీపికా, రణవీర్ భావిస్తున్నారు.

నవంబర్ 20 ఈ జంట వివాహానికి ముహూర్తమని తెలుస్తోంది. ఇటలీ లోని కొమో సరస్సు వద్ద వీరి వివాహం జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా రణవీర్, దీపికా ప్రేమలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











