Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాయ్ లక్ష్మీ ఇక్కడి నుంచి పూర్తిగా జెండా ఎత్తేస్తోందా?
సినిమా రంగంలో లక్కు కలసి రావాలని తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకున్న కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే చెప్పాలి. 'జూలీ 2' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకి అక్కడ సైతం తొలి ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఎదురైంది.
గతేడాది కేవలం ఒక్కటంటే ఒకే సినిమాలో నటించిన రాయ్ లక్ష్మి... ఈ ఏడాది తెలుగులో 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి' అనే చిత్రం చేసింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరో రెండు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తన కెరీర్ సాగుతున్న తీరు పట్ల ఆమె సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో వస్తున్న అవకాశాలు ఎగ్జైటింగ్‌గా లేక పోవడంతో... ఇక్కడ నుంచి జెండా ఎత్తేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిలవ్వాలనే ఆలోచనలో లక్ష్మీ రాయ్ ఉన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం లక్ష్మీరాయ్ తన రెండో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.
దీపిక్ తిజోరి దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ నెక్ట్స్ బాలీవుడ్ సినిమా ఉండబోతోందని, ఇందులో ఆమెతో పాటు నజియా హుస్సేనమీ, షమీ సికిందర్, అలంకృత సాహై, కైనత్ అరోరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాహుల్ మిత్రా, రాజు చద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.