twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవ లారెన్స్‌ను అవమానించారు: అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ నుంచి ఔట్!

    |

    'కాంచన' సిరీస్ సినిమాలు సౌత్‌లో సూపర్ సక్సెస్ కావడంతో... దర్శకుడు రాఘవ లారెన్స్ దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మీ బాంబ్' పేరుతో ఇటీవలే కాంచన రీమేక్ ప్రారంభం అయింది.

    శనివారం ఉదయం అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ పేజీ ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా తప్పుకుంటున్నట్లు రాఘవ లారెన్స్ ప్రకటించడం సెన్సేషన్ అయింది. అందుకు గల కారణాలను కూడా ఆయన ట్విట్టర్లో వివరించారు.

    గౌరవం లేని చోట ఉండకూడదు

    గౌరవం లేని చోట ఉండకూడదు

    హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. మనకు గౌరవం ఇవ్వని ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అనేది ఒక పాత తమిళ సామెత. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. అందుకే కాంచన హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్' నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ చెప్పాలనుకోవడం లేదని లారెన్స్ తెలిపారు.

    అది నన్ను చాలా బాధించింది

    అది నన్ను చాలా బాధించింది

    నాకు బాధించి విషయాల్లో ప్రధానమైనది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నాకు తెలియకుండానే రిలీజ్ చేయడం. మూడో వ్యక్తి ఎవరో చెబితే తెలిసింది. ఒక దర్శకుడికి తెలియకుండా అతడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే చాలా బాధగా ఉంటుంది. ఇది నన్ను అగౌరవ పరిచినట్లుగా ఫీలవుతున్నాను. ఒక క్రియేటర్‌గా... సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం కూడా నచ్చలేదు. ఇలా ఏ దర్శకుడిగా జరుగకూడదని లారెన్స్ చెప్పుకొచ్చారు.

    అక్షయ్ కుమార్ మీద గౌరవం ఉంది

    అక్షయ్ కుమార్ మీద గౌరవం ఉంది

    నాకు అక్షయ్ కుమార్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే ఈ సినిమాను ఆపాలనుకోవడం లేదు. నా స్క్రిప్టును వాడుకోవడానికి నిర్మాతలకు అనుమతి ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న నటీనటులు, టెక్నీషియన్లందరికీ శుభాకాంక్షలు అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.

    తలుచుకుంటే నా స్క్రిప్టును వెనక్కి తీసుకోవచ్చు

    నేను తలుచుకుంటే నా స్క్రిప్టును వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో నేను ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. కానీ అలా చేయడం ప్రొఫెషనలిజం కాదు. అక్షయ్ కుమార్ సర్ అంటే నాకు చాలా గౌరవం. అందుకే అలా చేయడం లేదని లారెన్స్ చెప్పుకొచ్చారు.

    గౌరవంగా తప్పుకోవాలనుకుంటున్నాను

    గౌరవంగా తప్పుకోవాలనుకుంటున్నాను

    నా స్థానంలో ఇంకెవరినైనా దర్శకుడిని పెట్టుకుని సినిమాను పూర్తి చేసుకోవచ్చు. త్వరలోనే నేను అక్షయ్ కుమార్ సర్‌ను కలిసి నా స్క్రిప్టు ఆయనకు అప్పగించేందుకు రెడీ అవుతున్నాను. ఈ ప్రాజక్టు నుంచి గౌరవంగా తప్పుకోవాలనుకుంటున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని లారెన్స్ ట్వీట్ చేశారు.

    English summary
    "Dear Friends and Fans..!I In this world, more than money and fame, self-respect is the most important attribute to a person’s character. So I have decided to step out of the project, #Laxmmibomb Hindi remake of Kanchana." Director Raghava Lawrence tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X