twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 కోట్ల కుంభకోణం ఉచ్చులో హీరోయిన్.. కొరడా విదిలిస్తున్న ఈడీ

    |

    ఢిల్లీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అతిపెద్ద దోపిడీ రాకెట్‌ న్యూస్ ఇటీవల హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తీవ్ర స్థాయిలో విచారణను జరుపుతున్నారు. ఏ మాత్రం పట్టు విడువకుండా టాప్ సెలబ్రేటీలను సైతం ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

    మద్రాఫ్ కేఫ్ నటీమణి లీనా మారియాపై కూడా విచారణ జరిపినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 200 కోట్ల దోపిడీ కేసులో 'మద్రాస్ కేఫ్' నటి లీనా మరియా పాల్‌ని ED విచారించినట్లు అనేక రాక కథనాలు వెలువడుతున్నాయి.

    Ram Gopal Varma తో రెచ్చిపోయి హీరోయిన్ డ్యాన్స్.. ఇనయా సుల్తానా ఎవరో తెలుసా?Ram Gopal Varma తో రెచ్చిపోయి హీరోయిన్ డ్యాన్స్.. ఇనయా సుల్తానా ఎవరో తెలుసా?

    స్పెషల్ గా ఫోకస్ ఓఎత్తింది ED

    స్పెషల్ గా ఫోకస్ ఓఎత్తింది ED

    ఈ కేసు విషయంలో అధికారులు ఇటీవల 16 హై-ఎండ్ కార్లతో పాటు, చెన్నైలో ఉన్న ఒక విలాసవంతమైన బీచ్ ఫ్రంట్ బంగ్లా, రూ .82.5 లక్షల నగదు మరియు మనీలాండరింగ్‌లో 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ .200 కోట్ల దోపిడీ కేసులో ప్రమేయం ఉన్నందుకు ఏడుగురితో పాటు ఇటీవల అరెస్టయిన కొంతమంది ప్రముఖులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

    ఇదివరకే ఆమెపై పలు కేసులు

    ఇదివరకే ఆమెపై పలు కేసులు

    2013లో విడుదలైన 'మద్రాస్ కేఫ్' చిత్రంలో నటించిన సుకేశ్ చంద్రశేఖర్ స్నేహితురాలు నటి లీనా మరియా పాల్‌ని కూడా ED అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. భారీ స్థాయిలో మోసం చేయడమే కాకుండా అమాయక జనాలను కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. 2013లో ఒక కేసు కూడా నామ్లడైంది.

    బోగస్ సంస్థలో పెట్టుబడితో మోసం

    బోగస్ సంస్థలో పెట్టుబడితో మోసం

    కెనరా బ్యాంక్‌లో రూ .19 కోట్లు మోసం చేసినందుకు 2013 లో సుఖేష్ చంద్రశేఖర్‌తో పాటు లీనా మరియా పాల్‌ను మొదట అరెస్టు చేశారు. అంతే కాకుండా 2015లో అధిక రాబడుల వాగ్దానంపై ప్రజలను బోగస్ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించినందుకు వారిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మళ్లీ అరెస్టు చేసింది. ఇంతలో, ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఆధారంగా, ED కేసు నమోదు చేసింది.

    సహాయం చేసిన వారిపై కూడా కేసు నమోదు

    సహాయం చేసిన వారిపై కూడా కేసు నమోదు

    పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత సుకేశ్‌ను రిమాండ్‌కు తీసుకువెళుతుంది. కొన్ని రోజుల క్రితం, ఆర్‌బిఎల్ బ్యాంక్ సిపి బ్రాంచ్ మేనేజర్ కోమల్ పొద్దార్, అతని ఇద్దరు సహాయకులను సుకేశ్ కోసం డబ్బు సదుపాయం మరియు లాండరింగ్ కు సహకరీంచారనే ఆరోపణలపై ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. నిందితులు నిధుల సర్క్యులేషన్ అలాగే అతని కోసం నగదును ఏర్పాటు చేయడంలో పాల్గొన్నట్లు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారి ఒకరు వెల్లడించారు.

    ఈ రాకెట్ ఎలా నడుస్తుందంటే..?

    ఈ రాకెట్ ఎలా నడుస్తుందంటే..?

    ఇప్పుడు ఈ రాకెట్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి అధికారులు మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల వలె నటించడానికి క్రేజీ కాల్ అనే యాప్ ద్వారా నంబర్ స్పూఫింగ్‌ని ఉపయోగిస్తున్నాడు. అతను ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి కాల్ చేస్తాడు. బాధితులు చంద్రశేఖర్ కోరుకున్నట్లుగా వారి ఫోన్ స్క్రీన్‌లో నంబర్లను చూస్తారు. బాధితురాలికి అతని చివరి కాల్‌లలో, అతను లా సెక్రటరీగా నటించాడు. ఇక చంద్రశేఖర్ కు సంబంధించిన సహచరులను కూడా జైలు అధికారులను కూడా అరెస్టు చేసినట్లు.. చెప్పారు.

    English summary
    Leena Maria Paul Case: ED Interrogates Madras Cafe Actress For 200 Crore Extortion Case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X