twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

    |

    మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించేలా సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు బసు చటర్జీ ఇకలేరు. వృద్ధాప్య సంబంధింత వ్యాధులతో ఆయన గురువారం ఉదయం మరణించారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
    బసు మృతికి బాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో శాంతాక్రజ్ శ్మశాన వాటికలో ముగిసాయి. ఆయన మృతికి అమోల్ పాలేకర్, అమితాబ్, తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

    బసు చటర్జీ మృతిని ఫిల్మ్ మేకర్స్ అండ్ ఇండియన్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్స్ సభ్యుడు అశోక్ పండిట్ ధృవీకరించారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ బసు చటర్జీ మృతికి శ్రద్దాంజలి ఘటిస్తున్నాం. మాస్టర్ ఆఫ్ హ్యుమర్‌గా పేరొందిన ఆయన తన చిత్రాల్లో సామాజిక, నైతిక విలువలను జొప్పించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    Legendary Director Basu Chatterjee passes away

    80, 90వ దశకంలో హృషికేష్ ముఖర్జీ, బసు భట్టాచార్యతో కలిసి బసు ఛటర్జీ మధ్య తరగతి జీవితాల నేపథ్యంగా సినిమాలు రూపొందించారు. అమోల్ పాలేకర్‌తో చోటి సి బాత్, రజనీగంధా, చిత్‌చోర్ సినిమాలను రూపొందించారు.

    English summary
    Legendary Director Basu Chatterjee passes away. IFTDA mourns the demise of Legendary Filmmaker Basu Chatterjee.A Master of Humour who delved into social and moral issues through his films.We pray to the almighty to bless his noble soul & give courage to his family to bear the irreplaceable loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X