ఫిల్మ్ సిటీలో చిరుతపులి దాడి.. స్టార్ హీరో మూవీ షూటింగ్ లో ఘటన.. ఆస్పత్రిలో ఆర్టిస్ట్!
పేరుకు సినిమా వినోదాన్ని పంచేదైనా దానికోసం ఎంతో మంది అనేక విధాలుగా కష్టపడుతుంటారు. అందరూ మెచ్చే సినిమాను చిత్రీకరించేందుకు అహర్నిషలు కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి అనుకోని సంఘటనలు, ప్రమాదాలు ఎదురవుతుంటాయి. సినిమా చిత్రీకరించే సమయంలో ప్రమాదాల బారిన పడతారు.
యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ మూమెంట్స్ ఇలా ఏదో ఒక విషయంలో దెబ్బలు తగిలించుకోవడమో.. యాక్సిడెంట్ జరగడమో అవుతూ ఉంటాయి. ఎంతో రిస్క్ తో సినిమాలు తెరకెక్కించి సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు సినిమా బృందం. అయితే తాజాగా ఓ స్టార్ హీరో సినిమా షూటింగ్ సమయంలో చిరుత పులి దాడి చేయడం కలకలం రేపింది.

యాక్షన్ కామెడీనే కాకుండా..
బాలీవుడ్ లో యాక్షన్ అండ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన అక్షయ్ కుమార్ ఇప్పటికీ హిందీ చిత్రసీమలో సుమారు 100కుపైగా చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో అలరించిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత కామెడీ మూవీస్ సూపర్ ఎంటర్టైన్ చేశారు. యాక్షన్, కామెడీ మాత్రమే కాకుండా రొమాన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో.

గతేడాది ఏకంగా 5 సినిమాలు..
ఇక హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే. అంతేకాకుండా సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు అక్కీ. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో సూర్యవంశీ, ఆత్రంగి రే 2021లో రాగా మిగతా 5 చిత్రాలు గతేడాది విడుదల అయ్యాయి.

చిత్రీకరణ సమయంలో..
ప్రస్తుతం సెల్ఫీ, బడే మియా ఛోటే మియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్. బడే మియా ఛోటే మియా సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ముంబై ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో మేకప్ ఆర్టిస్ట్ పై చిరుతపులి దాడి చేసింది. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసేవరకు వెళ్లింది.

చిరుతను ఢీ కొట్టడంతో..
బడే మియా ఛోటే మియా సినిమాకు మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ పని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి ఆయన స్నేహితుడు ఒకరు వచ్చారు. లొకేషన్ కి సమీపంలో చాలా దగ్గరగా ఉన్న ఓ ప్రాంతంలో ఫ్రెండ్ ని డ్రాప్ చేసేందుకు బైక్ పై శ్రవణ్ వెళ్లాడు. అతన్ని డ్రాప్ చేసి తిరిగివస్తుండగా.. రోడ్డు అడ్డంగా పంది పరిగెడుతూ కనిపించింది. దీంతో బైక్ స్పీడ్ పెంచిన శ్రవణ్ పంది వెనుక వెంట పడిన చిరుతను ఢీ కొట్టాడు. అనంతరం అతనిపై చిరుత దాడి చేసింది.

చిరుత నాపై దాడి చేశాక..
ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ చికిత్స పొందుతున్నాడు. అనంతరం మీడియాతో ఘటన గురించి శ్రవణ్ వివరించాడు. "చిరుతను ఢీ కొట్టిన తర్వాత నేను బైక్ మీద నుంచి కింద పడ్డాను. ఆ తర్వాత చిరుత నా చుట్టూ తిరగడం గుర్తు ఉంది. అంతకు మించి ఇంకేం గుర్తు లేదు. నేను స్పృహ కోల్పోయాను. చిరుత నాపై దాడి చేసిన తర్వాత ఎవరైనా వచ్చి నన్ను ఆస్పత్రికి తీసుకు వచ్చి ఉంటారు" అని శ్రవణ్ తెలిపాడు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
శ్రవణ్ చికిత్సకు అయ్యే ఖర్చును అంతా బడే మియా ఛోటే మియా చిత్ర నిర్మాణ సంస్థలు భరిస్తున్నాయి. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ సుల్తాన్, టైగర్ జిందా హై, భారత్ సినిమాల డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శ్రవణ్ ఘటనపైఆల్ ఇండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్ లాల్ గుప్తా స్పందించారు. ఇలాంటి ఘటనలు ముంబై ఫిల్మ్ సిటీలో చాలా జరుగుతున్నాయన్నారు. వందల ఎకరాల్లో నిర్మించిన ఈ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా ఉండటం లేదని, చిరుతలు పదే పదే రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, రక్షణ కల్పించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











