Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ముద్దు సీన్లే సల్మాన్ ఖాన్, దర్శకుడికి మధ్య విబేధాలకు కారణమా?
సల్మాన్ ఖాన్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'ఇన్షాల్లా' అనే సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం ఆగిపోయింది. సల్మాన్ ఖాన్-సంజయ్ లీలా భన్సాలీ మధ్య విబేధాలు రావడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటున్నారు. సినిమాలోని ముద్దు సీన్ల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అందుకే సల్మాన్ ఖాన్ వెనకడుగు వేసినట్లుగా, ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తాజాగా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే..?
బాలీవుడ వెబ్ సైట్ల కథనాల ప్రకారం... ‘‘ ఇన్షాలా సినిమా నుంచి సల్మాన్ ఖాన్ తప్పుకోవడానికి కారణం కథ ప్రకారం ఇందులోని హీరోయిన్ అలియా భట్‌తో కలిసి సల్మాన్ ఖాన్ మల్టిపుల్ ముద్దు సీన్లు చేయాల్సిన అవసరం ఉండటమేనంట. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తన కెరీర్లో ఆన్ స్క్రీన్ లిప్ లాస్ సీన్లు ఎప్పుడూ చేయలేదు. అలాంటి సీన్లు చేయకూడదు అని పెట్టుకున్న రూల్ బ్రేక్ చేయకూడదు అనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
భాన్సాలీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన సల్మాన్
సినిమా నుంచి లిప్ లాక్ ముద్దు సీన్లను తీసి వేయాలని సంజయ్ లీలా భాన్సీలీని కన్విన్స్ చేశాడట సల్లూ భాయ్. అయితే అందుకు ఒప్పుకున్నట్లు సంకేతాలు ఇచ్చిన భన్సాలీ తర్వాత అలా కదరదని చెప్పారట. ఆ సీన్లు చేస్తే ఇప్పటి వరకు తన సినిమాలపై ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇమేజ్ దెబ్బతింటుందని భావించిన సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ లేకుండానే ఇన్షాల్లా
సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సంజయ్ లీలా భన్సాలీ మరో హీరో కోసం సెర్చింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియదు. మరో వైపు అలియా భట్ తన తండ్రి తీస్తున్న ‘సడక్ 2' షూటింగులో జాయిన్ అయింది. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ దబాంగ్ 3
మరో వైపు సల్మాన్ ఖాన్ త్వరలో దబాంగ్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 20, 2019న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, కిచ్చ సుదీప్, సాయీ మంజ్రేకర్, అర్భాజ్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.