twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ హీరోయిన్‌‌కి కవల పిల్లలు.. ఎట్టకేలకు తీరిన వేదన, క్యాన్సర్‌ని ఎదిరించి!

    |

    సూపర్ స్టార్ మహేష్ నటించిన సాహసాల చిత్రం టక్కరి దొంగ గుర్తుందిగా. ఆ చిత్రంలో ఇండో కెనడియన్ బ్యూటీ లిసా రాయ్ హీరోయిన్ గా నటించింది. నటించింది కొన్ని చిత్రాల్లో మాత్రమే అయినా లిసా రేయ్ అందానికి కొత్త నిర్వచనం తెలిపింది. ఈ 46 ఏళ్ల బ్యూటీ 2012 లో జాసన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని స్థిరపడింది. అప్పటి నుంచి సంతానం కోసం ఎదురుచూసిన లిసా రాయ్ క్యాన్సర్ తో కష్టాలు ఎదుర్కొంది. తాజాగా తాను ఇద్దరు కవల పిల్లలని సరోగసి విధానం ద్వారా పొందానని శుభవార్తని ప్రకటించింది.

    ఏకైన తెలుగు చిత్రం

    ఏకైన తెలుగు చిత్రం

    లిసా రేయ్ నటించిన ఏకైన తెలుగు చిత్రం టక్కరి దొంగ. 2001 లో ఈ చిత్రం విడుదలయింది. ఆ తరువాత కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా సినిమా రంగంలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2012 లో వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది.

    కవల పిల్లలు

    తాజగా లిసా రాయ్ కవల పిల్లలకు సరోగసి విధానం ద్వారా తల్లి అయింది. కవల పిల్లలైన ఇద్దరు కూతుళ్ళని పొందానని, అది కూడా సరోగసి విధానం ద్వారా పొందానని లిసా రాయ్ ధైర్యంగా ప్రకటించింది. సరోగసి విధానంపై జనాల్లో అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా పిల్లలు అంటే విచిత్రంగా చూస్తారు.

    నేను, మా అయన డిసైడ్ అయ్యాం

    నేను, మా అయన డిసైడ్ అయ్యాం

    సరోగసి విధానం టాప్;తప్పు కాదు. దీని గురించి అంతా అవగాహన ఏర్పరుచుకోవాలి. అందుకే నేను, నా భర్త సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందినట్లు ప్రకటిస్తున్నాం అని లిసా రాయ్ తన సోషల్ మీడియాలో పేర్కొంది.

    సరోగసి ఎందుకు

    సరోగసి ఎందుకు

    తప్పని పరిస్థితుల్లో తాము సరోగసి విధానం ఎంచుకోవాల్సి వచ్చిందని లిసా రాయ్ తెలిపింది. 2009 లో లిసా రాయ్ క్యాసర్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. చికిత్స అనంతరం తనకు క్యాన్సర్ నయం అయిందని 2010 లో ప్రకటించింది. కానీ వివాహం తరువాత 2012 లో క్యాన్సర్ మళ్ళి తిరగబెట్టింది. ఇప్పటికి ఆమె క్యాన్సర్ కోసం మెడిసిన్స్ వాడుతూనే ఉంది.

    సంతానం కోసం

    సంతానం కోసం

    క్యాన్సర్ తో ఓ వైపు ఇబ్బంది అపడుతున్నా తల్లి కావాలనే కొరికి లిసా రాయ్ కు బలంగా ఉండేది. కానీ క్యాన్సర్ ఉన్న సమయంలో గర్భం దాల్చితే మందుల వలన ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఉద్దేశంతో పిల్లలని కనలేదు. చివరకు లిసా రాయ్ దంపతులు సరోగసి ద్వారా పిల్లని పొందాలని నిర్ణయించుకున్నారు.

    చివరకు జార్జియాలో

    చివరకు జార్జియాలో

    సరోగసి విధానంలో పిల్లలని పొందేందుకు అనేక ప్రత్నాలు చేశారు. ఇండియాలో అది బాగా కమర్షియల్ కావడం, మెక్సికోలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చివరకు జార్జియా వెళ్లారు. అక్కడ వారి కోరిక ఫలించింది. లిసా రాయ్, జాసన్ దంపతులు జార్డియాలో సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల ఆడపిల్లలని సంతానంగా పొందారు.

    English summary
    Lisa Ray announces birth of twin daughters via surrogacy. Lisa Ray announced on Instagram that she and husband Jason Dehni had become parents to twin daughters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X