లైవ్ అప్డేట్స్: ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఎంగేజ్‌మెంట్ .. తరలివస్తున్న బాలీవుడ్ తారలు!
Recommended Video

మాజీ ప్రపంచ సుందరిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా చెక్కు చెదరని అందం, అద్భుతమైన నటనతో తన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసుకుంది. హాలీవుడ్ లో సైతం ప్రియాంక చోప్రా సంచలనంగా మారింది. దశాబ్దాల కాలంగా ప్రియాంక చోప్రా నటిగా రాణిస్తూ తన ఖ్యాతిని పెంచుకుంటోంది. ఇటీవల హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో ప్రారంభమైన ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అలా ప్రేమ మొదలైందో లేదో అప్పుడే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ప్రియాంక వివాహం గురించి గత కొన్ని మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలొ ప్రియాంక, నిక్ నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూజ కార్యక్రమం
పూజ కార్యక్రమంతో ప్రియాంక నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రియాంక, నిక్ నిశ్చితార్థం జరుగుతోంది. కొంత మంది స్నేహితులు, బంధువుల మధ్య మాత్రమే ప్రియాంక నిశ్చితార్థ వేడుక ప్రైవేట్ కార్యక్రమంగా జరుగుతోంది.
పరిణీతి చోప్రా ఎంట్రీ
లక్నోలో తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీగా పరిణీతి చోప్రా గడుపుతోంది. ప్రియాంక చోప్రా నిశ్చితార్థం కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన పరిణీతి కొద్దీ సేపటి క్రితమే ప్రియాంక నివాసానికి చేరుకుంది.
ప్రియాంక స్నేహితులు
ప్రియాంక చోప్రా స్నేహితులు ఒకొక్కరుగా ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. రచయిత ముస్తాక్ షేక్, నిర్మాత శ్రిష్టి బెహల్ కొద్ది సేపటి క్రితమే ప్రియాంక చోప్రా నివాసానికి చేరుకున్నారు. శ్రిష్టి 2008 లో నిర్మించిన ద్రోణ చిత్రంలో ప్రియాంక నటించింది.

ప్రియాంక ధరించే డ్రెస్సు
ఇంట్లో కొద్దిమంది బంధు మిత్రుల మధ్య సంప్రదాయబద్ధంగా ప్రియాంక చోప్రా నిశ్చితార్థం జరుగుతోంది. సాయంత్రం సబర్బర్ ఫైవ్ స్టార్ హోటల్ లో పీసీ, నిక్ ఎంగేజ్ మెంట్ పార్టీ ప్లాన్ చేశారు. ఇక్కడికి కూడా కెమెరాలు ప్రవేశించే అవకాశం లేదు. ఈ పార్టీ కూడా ప్రైవేట్ గానే జరగనుంది. ఈవేడుకలో పీసీ ధగ ధగ మెరిసే అందమైన గౌన్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

నోరూరించే వంటకాలు
పార్టీలో అన్నిరకాల వంటకాలు రెడీ చేస్తున్నారట. లోకల్, కాంటినెంటల్, వెస్ట్రన్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుక పీసీ ఇంట్లో జరుగుతుండగా సాయంత్రం ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ జరగనుంది.


Click it and Unblock the Notifications











