మీడియా కంటపడకుండా ప్రియురాలిని పెళ్లాడిన డైరెక్టర్.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడితో కలిసి అలా..
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యువ దర్శకుడు లవ్ రంజన్ ఒక ఇంటి వాడు అయ్యాడు. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు అలీషా వేద్‌ను వైభవంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకొన్నారు. లవ్ రంజన్ పెళ్లికి ఆగ్రాలోని తాజ్ మహల్‌కు సమీపంలో ఉన్న విలాసవంతమైన హోటల్ వేదికగా మారింది.
లవ్ రంజన్, అలీషా వేద్ ఇద్దరూ తమ కాలేజీ లైఫ్ నుంచే ప్రేమలో ఉన్నారు అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న ప్రేమ, అభిమానమే వారిద్దరిని కలిపింది. అయితే అలీషా వేద్ యాక్టింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. సుదీర్ఘకాలం డేటింగ్ అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ పెళ్లికి హాజరైన వారిలో యువ హీరోలు అర్జున్ కపూర్, రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, శ్రద్దా కపూర్, వరుణ్ శర్మ, దినేష్ విజన్, భూషణ్ కుమార్, సంగీత దర్శకుడు ప్రీతమ్ తదితరులు హాజరయ్యారు.

దర్శకుడు లవ్ రంజన్ పెళ్లిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పెళ్లికి హాజరైన వీరిద్దరూ ప్రేమ పక్షులుగా తాజ్ మహల్ వద్ద కనిపించారు. వీరితోపాటు తాజ్ మహల్‌ను దర్శించుకొన్న వారిలో కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్, నుస్రత్ బరుచా ఉన్నారు.
ఇదిలా ఉండగా, లవ్ రంజన్, అలీషా వేద్ పెళ్లి వేడుకలు రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లిలో మనీష్ మల్హోత్రా, సవ్యసాచి డిజైన్ దుస్తులు ధరించి వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా మారారు.
అయితే పెళ్లి వేడుకను మీడియాకు దూరంగా నిర్వహించారు. ఈ విషయంపై సినీ ప్రముఖుడు మాట్లాడుతూ.. లవ్, అలీషా ఇద్దరు తమ వివాహ వేడుకను ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని అనుకొన్నారు. కేవలం తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించకుండా మీడియాను దూరంగా పెట్టాలని అనుకొన్నారు. అందుకే ఈ పెళ్లి గురించి మీడియాలో ఎక్కడా వార్తలు కనిపించలేదు అని చెప్పారు.
ఇక లవ్ రంజన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామ, సోను కే టిటు కి స్వీటీ చిత్రాలతో లవ్ రంజన్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రణ్‌బీర్, శ్రద్దా కపూర్ జంటగా ఒక చిత్రం నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











