అవార్డుల వేడుకలో అందరి మతి పోగొట్టిన ఐష్, సెక్సీగా జాహ్నవి కపూర్ (ఫోటోస్)
Recommended Video

లక్స్ గోల్డెన్ రోస్ అవార్డ్స్ కార్యక్రమం ఆదివారం రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, కాజోల్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, టైగర్ ష్రాఫ్, జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ తదితరులు హాజరై ఈ అవార్డుల వేడుకను మరింత కలర్‌ఫుల్‌గా మార్చారు.
ఈ వేడుకలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఎంట్రీ ఇవ్వగానే అందరి మతులు పోగొట్టింది. ఈ వయసులోనూ ఆమె సెక్సీ బాంబ్ షెల్ అవతారంలో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ అవార్డుల వేడుకలో ఎవరి లుక్ ఎలా ఉంది అనే అంశంపై ఓ లుక్కేద్దాం...

ఐశ్వర్యరాయ్ మైండ్ బ్లోయింగ్ లుక్
ఈ అవార్డుల వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఐశ్వర్యరాయ్. 45 ఏళ్ల వయసులోనూ... ఐష్ ఏమాత్రం వన్నె తగ్గకుండా గ్లామర్ మెయింటేన్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్య పరిచింది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుతో ఐష్
లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ వేడుకలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఐశ్వర్యరాయ్. ఈ వేడుకకు హాజరైన తారామణుల్లో అందం పరంగా ఐష్‌ను బీట్ చేసే నాయిక ఎవరూ లేక పోవడం గమనార్హం.

అందరి చూపు తనవైపు తిప్పుకున్న కరీనా
మరో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన ముగ్ద మనోహర రూపంతో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంది.

ఒకే వేదికపై మాజీ ప్రేమికులు
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, సిద్దార్థ్ మల్హోత్రా గతంలో ప్రేమించుకుని విడిపోయారు. అయితే ఈ మాజీ ప్రేమికులు ఈ అవార్డ్స్ వేడుక ద్వారా ఒకే వేదికపైకి రావడం చర్చనీయాంశం అయింది.

అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షార్ప్ అండ్ డైనమిక్ లుక్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బి టౌన్ టాప్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ హుందాగా వ్యవరిస్తూనే అందరినీ నవ్వించారు.

కరిష్మా కపూర్
లక్స్ గెల్డెన్ రోజ్ అవార్డుల వేడుకలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.

జాహ్నవి కపూర్
ఇటీవలే ‘ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్... ఈ అవార్డుల వేడుకలో తన సెక్సీ లుక్‌తో కుర్రకారు మతి పోగొట్టతింది. స్పెషల్‌గా డిజైన్ చేసిన తెలుపు రంగు డ్రెస్సులో జాహ్నవి ఏంజెల్‌లా దర్శనమిచ్చింది.

కాజోల్
ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజోల్... ఇప్పటికీ ఇండస్ట్రీలో తన హవా కొనాసగిస్తూనే ఉన్నారు. ఈ అవార్డుల వేడుకలో కాజోల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

జాక్వెలిన్, టైగర్, తాప్సీ
లక్స్ గెల్డెన్ రోజ్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, టైగర్ ష్రాఫ్, తాప్సీ పన్ను.....


Click it and Unblock the Notifications











