ఫోన్ చేసి డబ్బు ఎరగా వేసి వెకిలి చేష్టలు.. బడా నిర్మాత బండారం బయటపెట్టిన హీరోయిన్
క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఈ మధ్య కాలంలో ఓపెన్ గానే వారికి ఎదురైన చేదు అనుభవాలను గురించి ధైర్యంగా భయటపెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సీనియర్ నటి కూడా ఇటీవల ఒక బడా నిర్మాతకు సంబంధించిన ప్రవర్తన గురించి వివరించింది. మీటూ కామెంట్స్ తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో ఈ 35ఏళ్ళ బ్యూటీ మరోసారి మీటూ వివాదంపై కొత్త తరహా కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ మాన్వి గాగ్రో.

నచ్చిన పని చేసుకుంటూ..
మూడు పదుల వయసు దాటినా కూడా మాన్వి గ్లామర్ ప్రజెంటేషన్ లో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సోషల్ మీడియాలో నెటీజన్స్ కి సరికొత్త ట్రీట్ ఇస్తోంది. సరికొత్తగా కనిపిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి గ్లామర్ డోస్ పెంచుతోంది. కేవలం తనకు వచ్చిన అవకాశాల్లో నచ్చిన ప్రాజెక్టులనే ఎంచుకుంటోంది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

ఆ వెబ్ సిరీస్ ద్వారా..
ఫోర్ మోర్ షాట్స్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా మాన్వి కొంత క్రేజ్ తెచ్చుకుందనే చెప్పాలి. అందులో ఆమె చేసిన బోల్డ్ యాక్టింగ్ కి ఓ వర్గ ఆడియెన్స్ బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. అలాగే మెడ్ ఇన్ హెవెన్ అనే మరొక సిరీస్ ద్వారా కూడా మాన్వి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. మాన్వి ఎలాంటి పాత్ర చేసినా అందులో ఒక స్పెషల్ కంటెంట్ ఉంటుందనే విధంగా టాక్ సొంతం చేసుకుంటోంది.

బడా నిర్మాతతో చేదు అనుభవం..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాన్వి తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది. ఒక బడా నిర్మాత కాంప్రమైజ్ కావాలని అడిగాడని ఈ విధంగా తెలిపింది. 'ఒక ప్రముఖ నిర్మాత నాకు ఫోన్ చేసి వెబ్ సిరీస్ లో నటించడానికి ఎంత తీసుకుంటావ్ అని అడుగాడు. కథ చెప్పకుండా ముందు ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నా. కానీ అతను నేను తీసుకునే ప్యాకేజ్ కంటే త్రిబుల్ పేమెంట్ ఇస్తానని అన్నాడు. అందుకు కాంప్రమైజ్ కావాలని కోరినట్లు మాన్వి తెలిపింది.
Recommended Video

పోలీసులకు కంప్లైంట్ చేస్తాను..
ఆ నిర్మాత అలా మాట్లాడగానే కోపంగా మాన్వి అతనిపై విరుచుకుపడిందట. ఇంకోసారి ఇలా మాట్లాడితే పోలీసులకు పిర్యాదు చేస్తానని చెప్పి అతని నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది. గతంలో కూడా ఒకసారి ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు వివరించిన మాన్వి మీటూ ఉద్యమం వచ్చిన తరువాత కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుండడం ఆశ్చర్యంగా ఉందని తెలియజేసింది.


Click it and Unblock the Notifications











