గాడిదలు, ఫూల్స్... ఇంత నీచంగా ప్రర్తిస్తారా? ప్రియాంక చోప్రా తల్లి ఫైర్!

పెళ్లి వేడుకతో ప్రియాంక చోప్రా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటిన వేళ 'ది కట్' అనే అమెరికన్ మేగజైన్ కథనం తీవ్ర దురమారం రేపిన సంగతి తెలిసిందే. అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమ వివాహం చేసుకున్న వేళ వారి ప్రేమ బంధం నిజమైంది కాదు అంటూ సదరు మేగజైన్ కథనం ప్రచురించింది.

ప్రియాంక చోప్రాను 'గ్లోబల్ స్కామ్ ఆర్టిస్టు'గా పేర్కొంటూ సదరు మేగజైన్ ఆరోపణలు చేయడంతో పాటు నిక్-ప్రియాంక మధ్య ఉన్నది నకిలీ రిలేషన్ షిప్ అని, ఈ పెళ్లి ద్వారా ఇద్దరూ తమ స్టేటస్ పెంచుకునే ప్రయత్నం చేశారని, వారిది నిజమైన ప్రేమ కాదంటూ తన కథనంలో పేర్కొంది. ఈ కథనంపై సర్వత్రా విమర్శలు వెల్లువుత్తాయి. ఇది ప్రియాంక పట్ల జాతి వివక్ష ప్రదర్శిస్తూ విషం చిమ్మడమే అంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అయ్యాయి.

ప్రియాంక తను ప్రేమించి వ్యక్తిని పెళ్లాడటం సంతోషంగా ఉంది

ప్రియాంక తను ప్రేమించి వ్యక్తిని పెళ్లాడటం సంతోషంగా ఉంది

ది కట్ మేగజైన్ కథనంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ‘‘మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్న సమయం ఇది. అలాంటి చెత్త కథనాలు మమ్మల్ని డిస్ట్రిబ్ చేయలేవు. నా కూతురు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం సంతోషంగా ఉంది.

ఫూల్స్, గాడిదలు అంటూ...

ఫూల్స్, గాడిదలు అంటూ...

ఇలాంటి కథనాలు రాసిన ఫూల్స్ గురించి స్పందించి వారికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవడం లేదు. చెత్త పనులు చేసే గాడిదలు ఉంటాయి. వాటి అరుపుల వల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని మధు చోప్రా వ్యాఖ్యానించారు.

 ప్రియాంక రియాక్షన్

ప్రియాంక రియాక్షన్

ఈ కథనంపై ప్రియాంక చోప్రా రియాక్ట్ అవుతూ... ‘ఈ వార్తలను తాను అసలు పట్టించుకోను. దానిపై స్పందించాలని అనుకోవడం లేదు. వాటిని నా ఆవరణలోకి కూడా రానివ్వను. ప్రస్తుతం నేను సంతోషకరమైన మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను. నా సంతోషాన్ని ఇవి డిస్ట్రబ్ చేయలేవు' అని తెలిపారు.

క్షమాపణలు చెబుతూ కథనం తొలగింపు

ప్రియాంక చోప్రా మీద విషం చిమ్ముతూ రాసిన కథనంపై సర్వాత్ర విమర్శలు రావడం, జాతి వివక్షను చూపే విధంగా ఉండటంతో వెంటనే క్షమాపణలు చెబుతూ ది కట్ మేగజైన్ దానని తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. మారియా స్మిత్ అనే లేడీ జర్నలిస్ట్ రాసిన ఈ కథనం తమ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేదని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X