పెళ్లి రద్దు నిజమే: ఒప్పుకున్న ప్రియాంక చోప్రా తల్లి!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం గురించి రెండు మూడు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతవారమే ఇషితా కుమార్‌తో అతడి వివాహం జరుగాల్సి ఉంది. అయితే ఆమెకు ఎమర్జెన్సీ సర్జరీ జరుగడంతో పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.
అయితే రెండు రోజుల క్రితం ఇషితా కుమార్ తన సోషల్ మీడియా పేజీ నుంచి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం, కొత్త జీవితం ప్రారంభించినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో వీరి పెళ్లి రద్దయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై మధు చోప్రా స్పందించారు. 'పెళ్లి రద్దయిన విషయం నిజమే. వారు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు, పెళ్లి వేడుక రద్దు చేసుకున్నారు' అని తెలిపారు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటనేది మధు చోప్రా వెల్లడించలేదు.
ఇషితా కుమార్ సైతం తన సోషల్ మీడియా పేజీ ద్వారా పెళ్లి రద్దుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. ''ఒక అందమైన ముగింపు తర్వాత... నా జీవితం ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలైంది'' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇషితా పోస్టుకు ఆమె తల్లి నిధి కుమార్ రియాక్ట్ అవుతూ.. 'పాత పుస్తకం మూసేసి.. కొత్తగా రాయి' అని కామెంట్ పెట్టారు. 'మేము నీకు తోడుగా ఉన్నాం' అంటూ తండ్రి మరో కామెంట్ పెట్టారు.


Click it and Unblock the Notifications











