కరీనా కొడుకు తైమూరుతో సినిమా.. మధుర్ బండార్కర్ క్లారిటీ
బాలీవుడ్ మీడియాకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ అంటే పిచ్చి క్రేజ్. తైమూరు కనిపించాడంటే ఫోటోగ్రాఫర్లు వెంటపడటం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ల వేధింపులు తట్టుకోలేక.. మీ కెమెరా ఫ్లాష్‌లతో మా అబ్బాయి కళ్లు పోతాయని సైఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తైమూర్‌పై నేషనల్ అవార్డు విజేత మధుర్ భండార్కర్ ఓ సినిమా తీస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడై కూశాయి.
ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన మధుర్ బండార్కర్‌ను తైమూర్‌తో సినిమా విషయాన్ని ప్రస్తావించగా.. ఆ వార్తలను కొట్టిపాడేశాడు. తైమూర్‌తో సినిమా తీస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అన్నారు.

తాను తీసే తదుపరి చిత్రం టైటిల్ గాలీబ్ అని మధుర్ బండార్కర్ తెలిపారు. చాందీని బార్‌తో నా కెరీర్ మొదలై.. ఇందు సర్కార్ వరకు సాగింది. ప్రస్తుతం గాలీబ్ సినిమా కథపై పనిచేస్తున్నాం. ఇసుక మాఫియాపై సినిమా ఉంటుంది. గత 8 నెలలుగా పరిశోధన చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
గతంలో కరీనా కపూర్‌తో హీరోయిన్ అనే చిత్రాన్ని రూపొందించారు. తాజాగా తైమూర్‌తో కూడా సినిమా రూపొందిస్తున్నట్టు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











