శ్రీదేవి పేరు చెప్పగానే గుండె పగిలింది: మాధురీ.. తల్లిని తలుచుకొని జాన్వీ కపూర్..!

బాలీవుడ్‌లో కాలాంక్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు క్రేజీగా మారాయి. సినిమాలో నటించే నటీనటుల స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో బహార్ బేగం పాత్రలో స్వర్గీయ శ్రీదేవి కనిపించాల్సింది. అయితే శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడటంతో ఆమె నటించాల్సిన పాత్ర శ్రీదేవికి దక్కింది. తన తల్లి నటించాల్సిన పాత్రలో మాధురీ కనిపించడంతో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ఎమోషనల్‌గా మారి ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో ఏమున్నదంటే..

ఇన్స్‌టాగ్రామ్‌లో మాధురీ, శ్రీదేవీ ఫోటో

ఇన్స్‌టాగ్రామ్‌లో మాధురీ, శ్రీదేవీ ఫోటో

కాలాంక్ సినిమాలో తన తల్లి చేయాల్సిన పాత్రను గుర్తు చేసుకొని జాన్వీ కపూర్.. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ ఫోటోను షేర్ చేసింది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నా తల్లి హృదయానికి చాలా దగ్గరైంది. ఆ తర్వాత విషాదం చోటుచేసుకోవడం, ఆ పాత్రలో కనిపించాలని నిర్ణయం తీసుకొన్న మాధురి దీక్షిత్‌కు మా కుటుంబం థ్యాంక్స్ చెప్పుకొంటున్నది అని జాన్వీ కపూర్ షేర్ చేశారు.

బహార్ బేగం పాత్రలో మాధురీ

బహార్ బేగం పాత్రలో మాధురీ

కాలాంక్‌లో బహార్ బేగం ఆఫర్ గురించి మాధురి దీక్షిత్ గుర్తు చేసుకొంటూ.. శ్రీదేవి మరణించారనే వార్త నుంచి కోలుకోలేకపోయాను. ఆ క్రమంలో నాకు ఈ పాత్రలో నటించమని కరణ్ జోహర్ రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నా గుండె పగిలినంత పనైంది. కొంత సమయం కావాలని అడిగి ఆ తర్వాత నేను ఆ రోల్‌ను స్వీకరించాను అని మాధురి దీక్షిత్ చెప్పింది.

శ్రీదేవి ఓ గొప్ప నటి

శ్రీదేవి ఓ గొప్ప నటి

భారతీయ సినిమా పరిశ్రమలో శ్రీదేవి గొప్పనటి. అలాంటి నటి చేయాల్సిన పాత్రను నేను చేయాల్సి రావడంతో భావోద్వేగానికి లోనయ్యాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా తోచింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతీ రోజు నేను శ్రీదేవిని గుర్తు చేసుకొన్నాను. ఆ పాత్రను చేసేటప్పుడు మరింత బాధ్యతగా ఫీలయ్యాను అని మాధురీ దీక్షిత్ పేర్కొన్నారు.

 శ్రీదేవీతో నా అనుబంధం అలా

శ్రీదేవీతో నా అనుబంధం అలా

సినీ పరిశ్రమలో శ్రీదేవితో నా ప్రయాణం చాలా ఏళ్లుగా సాగింది. మా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. శ్రీదేవి ఈ లోకం నుంచి సడెన్‌గా నిష్క్రమించడం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాం. ఆమె లేని లోటు పూడ్చలేనిది. శ్రీదేవికి మేమెవ్వరం సరితూగం. ఆమె నటించాల్సిన పాత్రకు న్యాయం చేశామని అనుకొంటే అదే నా కెరీర్ గొప్పగా భావిస్తాను అని మాధురీ దీక్షిత్ అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

 శ్రీదేవి బయోపిక్‌లో మాధురీ దీక్షిత్

శ్రీదేవి బయోపిక్‌లో మాధురీ దీక్షిత్

ఇదిలా ఉండగా, శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు నిర్మాత బోనికపూర్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను శ్రీదేవి పాత్ర కోసం అనుకొన్నారు. కానీ ప్రస్తుతం మాధురీ దీక్షిత్‌ను నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఎక్కడ ఎలాంటి సమాచారం లేకపోవడం అనేక సందేహాలకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X