twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాలిటిక్స్‌లోకి మాధురి దీక్షిత్.. బీజేపీ తరుఫున పోటి.. ఎక్కడ నుంచి అంటే!

    |

    సినీ రంగం తర్వాత సీని తారలు చూపు రాజకీయాల వైపే ఉంటాయి. గత కొన్నేళ్లలో చాలా మంది సినీ తారలు గోవిందా, అమితాబ్ లాంటి వారు రాజకీయ నేతలుగా చెలామణి అయ్యారు. తాజాగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

    పాలిటిక్స్‌లోకి మాధురి దీక్షిత్

    పాలిటిక్స్‌లోకి మాధురి దీక్షిత్

    2019లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ మొదలుకాబోతున్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మాధురి దీక్షిత్ 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది.

    పూణే బరిలో మాధురి

    పూణే బరిలో మాధురి

    సినీ రంగంతోపాటు టెలివిజన్ రంగంలో కెరీర్ కొనసాగిస్తున్న మాధురి దీక్షిత్ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. బీజేపీ తరఫున మహారాష్ట్రలోని పూణే నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

    బీజేపీ తరఫున మాధురి

    బీజేపీ తరఫున మాధురి

    మాధురి దీక్షిత్ పోటీ చేయడానికి సిద్ధం కావడంతో బీజేపీ తమ జాబితాలో ఆమె పేరును చేర్చినట్టు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ ఎలక్షన్ ప్రాబబుల్స్‌లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

    మాధురి దీక్షిత్ పేరు ప్రముఖంగా

    మాధురి దీక్షిత్ పేరు ప్రముఖంగా

    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను బీజేపీ భారీ సంఖ్యలో పక్కన పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఆ కారణంగానే కొత్త ముఖాలను ఎన్నికల బరిలో దించనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా అవినీతి మరకలు, గ్లామర్ ఉన్న రాజకీయ నేతల వేట ప్రారంభించిన క్రమంలో మాధురీ దీక్షిత్ పేరు ప్రముఖంగా మారింది.

    English summary
    Bollywood diva Madhuri Dixit is being considered by the BJP to be party's face in Lok Sabha Elections 2019 and contest from Pune seat. However, so far, there is no reaction or statement from Madhuri Dixit about making her political debut but reports say that BJP might field the veteran actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X