ఐటెం సాంగ్స్‌లో ఆ హీరోయిన్లు చెత్త.. నన్ను మించిన వారున్నారా? మాధురీ దీక్షిత్ హాట్ కామెంట్స్
సినీ పరిశ్రమలో అందంతోనూ, ప్రతిభతోనో ఆకట్టుకొన్న వారిలో మాధురి దీక్షిత్ ఒకరు. అద్భుతమైన పాత్రల్లో ఫెర్ఫార్మెన్స్‌తోపాటు.. ఐటెం సాంగ్‌లతో ఇరుగదీశారంటే అతిశయోక్తి కాదు. తేజాబ్ మూవీలో ఏక్ దో తీన్ పాటతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడమే కాకుండా ఓవరనైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు. అయితే కెరీర్ ఉన్నతంగా ఉండగానే అమెరికా డాక్టర్ శ్రీరాం నేనేను వివాహం చేసుకొని కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. మళ్లీ ప్రస్తుతం వినోద పరిశ్రమలో కీలకంగా మారారు. ఇటీవల కరణ్ జోహర్ షోలో ప్రస్తుత హీరోయిన్ల డ్యాన్సులు, స్టెప్పులపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో య్యూటూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాధురీ ఏమన్నారంటే..

వెండితెరపై స్పెప్పులతో జోరు
మాధురి దీక్షిత్ స్టెప్పుల గురించి ప్రస్తావిస్తే.. ఏక్ దో తీన్‌తో ప్రారంభమైన జోరు.. రాజా, బేటా చిత్రాల్లో పాటలతో ప్రేక్షకులనే కాదు.. సినీ హీరోలను కూడా ఉర్రూతలూగించారు. బేటా చిత్రంలో అనిల్ కపూర్‌తో చేసిన ధక్ ధక్ పాట అప్పట్లో సంచలనమే. ఇక రాజా సినిమాలో సంజయ్ కపూర్‌ను లవ్ యూ రాజా అంటూ వేసిన స్టెప్పులు సినిమాకు కాసుల పంటను పండించాయి.

ఐటెం గర్ల్స్ కరీనా, కత్రినా
అలా వెండితెరపై కేవలం పాటలతోనే కాకుండా నటనతో అదరగొట్టిన మాధురీ దీక్షిత్.. కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టగానే పలువురు హీరోయిన్లు తమ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఐటెం, స్పెషల్ పాటలతో కనువిందు చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే దంబంగ్ సిరీస్‌లో కరీనా కపూర్, కత్రినా అగ్నిపథ్‌లో చిక్నీ చమేలి అంటూ మాధురీ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నించారు.

గొప్ప డ్యాన్సర్ ఎవరంటే
కొద్ది రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కరణ్ జోహర్ షో కాఫీ విత్ కరణ్‌లో ప్రస్తుత హీరోయిన్ల తీరుతెన్నులను సమీక్షించారు. కరీనా, కత్రినాలో ఎవరు బెటర్ డ్యానర్ అనే విషయంపై రేటింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. తనకంటే గొప్ప డ్యాన్సర్ ఎవరు లేరనే చెప్పారు. దాంతో ఇప్పటికీ తానే నంబర్ వన్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
Recommended Video

వారి కంటే నేను గొప్పగా
హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన మున్నీ బద్నాం హుయీ, షీలా కీ జవానీ, చిక్నీ చమేలీ, ఫెవికాల్ లాంటి పాటల్లో ఎవరు బాగా స్టెప్పులు వేశారు.. ఏ పాటకు నీవు అద్భుతంగా డ్యాన్స్ చేసేవారు అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. అందరి కంటే నేనే బాగా చేస్తాను అని మాధురి దీక్షిత్ సమాధానం ఇచ్చింది.


Click it and Unblock the Notifications











