వెయ్యి మంది ఉండగా అలా చేసేదాన్ని.. నన్ను అలా పిలిచే వారు.. మాధురి దీక్షిత్
ఇండియన్ క్లాసిక్‌లో కొన్ని పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఐటెమ్ నెంబర్స్‌లో దేశాన్ని ఊపేసిన పాటలెన్నో ఉన్నాయి. వాటన్నంటిలో నెంబర్ వన్‌గా నిలిచేది మాధురి దీక్షిత్ ఏక్ దో తీన్ మాత్రమే. ఈ పాటలోని రిథమ్, సాంగ్, మాధురి లుక్స్, స్టెప్ప్ ఇవన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. తాజాగా నాటి విశేషాలను అభిమానులతో పంచుకుంది మాధురీ దీక్షిత్. అవేంటో ఓ సారి చూద్దాం.

ఉర్రూతలూగించిన పాట..
1988లో విడుదలైన ‘తేజాబ్' సినిమాలోని ఈ పాటకు దేశం మొత్తం మార్మోగిపోయింది. అనిల్ కపూర్ హీరోగా నటించగా... ఎన్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అంతా ఒకెత్తు.. ఏక్ దో తీన్ పాట అంతా ఒకెత్తు. ఈ పాటను మళ్లీ మళ్లీ ప్లే చేయమని థియేటర్స్‌లో గోల చేసేవారట. అంతలా మత్తెక్కించిన ఈ పాట గురించిన వివరాలు షేర్ చేసుకుంది మాధురి.

రీమేక్‌పై పెదవి విరుపు..
టైగర్ ష్రాఫ్, దిషా పఠానీ హీరోహీరోయిన్లుగా వచ్చిన బాఘీ 2 చిత్రం కోసం ఏక్ దో తీన్ సాంగ్ రీమిక్స్ చేశారు. ఈ పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నర్తించింది. అయితే రీమిక్స్ పాట అంతగా క్లిక్ కాలేదు. ఈ పాటపై మాధురీ స్పందిస్తూ.. పెదవి విరిచింది. క్లాసిక్స్ ముట్టుకోవద్దన్నట్టుగా పరోక్ష కామెంట్స్ చేసింది.

తాజాగా స్పందించిన మాధురి..
ప్రస్తుతం దేశమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ వైరస్‌ను అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలెబ్రిటీలు సైతం ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాధురి దీక్షిత్ నాటి క్లాసిక్ సాంగ్ ఏక్ దో తీన్‌పై చర్చించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.

వెయ్యి మంది ముందు చేసేదాన్ని..
ఏక్ దో తీన్ పాటను దాదాపు వెయ్యి మంది నిజమైన ప్రేక్షకుల మధ్య చిత్రీకరించినట్టు మాధురి చెప్పుకొచ్చింది. ఈ పాట షూట్ చేయడానికి 10,15 రోజుల ముందు నుంచే ప్రేక్షకుల మధ్య రిహార్సల్స్ చేసినట్టు, అలాగే వారి మధ్యే షూట్ చేసినట్టు వెల్లడించింది.
Recommended Video
మోహిని అని పిలిచేవారు..
‘ఈ పాటలోని హుక్ స్టేప్ బాగా పాపులర్ అయ్యింది. ఇక థియేటర్లలో సినిమా కొనసాగుతున్నంతసేపు మళ్లీ మళ్లీ ఈ పాటను ప్లే చేయాలని అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసి షాకయ్యాను. ఇక ఆ సమయంలో అందరూ నన్ను మోహినీ అని పిలవడం ప్రారంభించారు. వావ్.. ఈ సందర్భంగా అప్పటీ ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేలా చేసింది' అంటూ మాధురి ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











