twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thank God నిషేధం.. మోదీ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ సర్కార్ లేఖ

    |

    బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా నటించిన Thank God సినిమా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాను నిషేధించాలని దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఉన్నదని ఆరోపిస్తూ ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసారశాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    చిత్ర గుప్తుడి పాత్రపై అభ్యంతరం

    చిత్ర గుప్తుడి పాత్రపై అభ్యంతరం


    Thank God సినిమాకు సంబంధించిన ట్రైలర్‌లో చిత్ర గుప్తుడి పాత్రను కించపరిచే విధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. చిత్ర గుప్తుడిని చూపించిన విధానాన్ని హిందూ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. పురాణాలపై, హిందుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినీ యూనిట్ వ్యవహరించిందని గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. దాంతో కొన్ని వర్గాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

    ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో

    ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో


    పలు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు Thank God మూవీపై ఫిర్యాదులు, కోర్టులో కేసులు వేశాయి. ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. యూపీలో హిమాంశు శ్రీవాస్తవ అనే అడ్వకేట్ కేసు నమోదు చేశాడు. ఇంకా పలు చోట్ల నిరసనలు ఎగిసి పడుతున్నాయి. ఈ సినిమాపై నిషేధం విధించాలనే డిమాండ్ భారీగా వినిపడుతున్నది.

    కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ సర్కార్ లేఖ

    కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ సర్కార్ లేఖ


    Thank God సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం తెలియజేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ సినిమాపై నిషేధం వహించాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ లేఖ రాశారు. ఇటీవల వస్తున్న సినిమాలు, దర్శకుల పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    హిందూ దేవతలపై అసభ్యంగా

    హిందూ దేవతలపై అసభ్యంగా


    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. ఇటీవల కాలంలో కొందరు సినీ దర్శకులు, నిర్మాతలు హిందూ దేవతలను కించపరుస్తున్నారు. హిందూ దేవతలను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చిత్రగుప్తుడుగా నటించిన అజయ్ దేవగన్.. అశ్లీల సన్నివేశాల్లో కనిపించాడు. చాలా అంశాలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని విశ్వాస్ సారంగ్ పేర్కొన్నారు.

    Thank God మూవీలో తెరవెనుక, తెర ముందు


    నటీనటులు: అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు
    దర్శకత్వం: ఇంద్ర కుమార్
    నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఇంద్రకుమార్ తదితరులు
    సినిమాటోగ్రఫి: అసీమ్ బజాజ్
    ఎడిటర్: ధర్మేంద్ర శర్మ
    మ్యూజిక్: తనిష్క్ బగ్చీ, రోచక్ కోహ్లీ, ఆనంద్ రాజ్ ఆనంద్ తదితరులు
    బీజీఎం: అమర్ మహిలే
    రచన: ఆకాశ్ కౌశిక్, మధుర్ శర్మ
    రిలీజ్ డేట్: 2022-10-25

    English summary
    Bollywood Actor Ajay Devgn, Siddharth Malhotra and Rakul Preet Singh's Thank God in Trouble. Madhya Pradesh minister Vishwas Sarang demands Ban on Thank God, Writes a letter to Modi Government
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X