అశ్లీల సినిమాలతో మరింత ఇబ్బందుల్లో రాజ్ కుంద్రా.. కేసులో ఇరుక్కున్న షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే

అశ్లీల వీడియోలను షార్ట్ ఫిలిమ్స్ ను చిత్రీకరించిన కేసులో గత ఏడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు కారణంగా జైల్లోనే కొన్ని రోజుల పాటు విచారణను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా మళ్ళీ కొన్ని వారాల అనంతరం విడుదలయ్యారు. ఇక ఆ తరువాత అతని కొంతమంది నటీనటులు కూడా ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. బలవంతంగా పోర్న్ సినిమాలలో నటించమని ఒత్తిడి చేశారని కూడా ఆరోపించారు.

ఇక ఇప్పుడు మరోసారి రాజ్ కుంద్రాతో పాటు మరో ముగ్గురు అదే తరహా వివాదంతో వార్తల్లో నిలిచారు.
ముంబై శివారు ప్రాంతాల్లోని రెండు 'డీలక్స్ హోటళ్ల'లో రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలను చిత్రీకరించినందుకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. అలాగే రాజ్‌తో పాటు ప్రముఖ నటీమణులు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే లపై కూడా అశ్లీల వీడియోలను చిత్రీకరించినందుకు కేసు నమోదు చేశారు.

Maharashtra cyber police charge sheet field on raj kundra sherlyn chopra poonam pandey

మరో ప్రముఖ హిందీ సినీ నిర్మాత మీటా జున్‌జున్‌వాలా, కెమెరామెన్ రాజు దూబేపై కూడా ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి. ఇక డబ్బు కోసమే వారు ఈ విధంగా వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన వీడియోలను ప్రసారం చేశారని ఛార్జ్ షీట్ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 2021లో రాజ్ కుంద్రా బెయిల్ పొందిన అనంతరం చాలా సైలెంట్ గానే ఉన్నాడు. బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ దరించి తిరుగుతున్నాడు.

ఇక శిల్పా శెట్టితో అతను కొన్ని వ్యాపారాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ తరుణంలో డబ్బు కోసం అతను చట్ట విరుద్ధంగా అశ్లీల సినిమాలను నిర్మించి పలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడం జరిగింది. అలాగే షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే కు సంబంధించిన అశ్లీల వీడియోలు కూడా షూట్ చేశారని వారిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X