twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలియా, మహేష్‌ భట్‌కు షాకిచ్చిన నెటిజన్లు.. సడక్ 2 ట్రైలర్‌పై భారీగా ట్రోల్స్

    |

    ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ డైరెక్షన్‌లో సంజయ్ దత్, ఆలియా భట్, పూజా భట్, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సడక్ 2 చిత్రం ట్రైలర్‌ ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజం, సుశాంత్ మరణం అంశాలు వివాదాస్పదం కావడం, ఆ వివాదాల్లో మహేష్ భట్‌పై తీవ్రమైన ఆరోపణలు రావడం ఇప్పుడు సడక్ 2 సినిమాకు ఇబ్బందిగా మారింది.

    ఆగస్టు 28వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌పై రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అయితే సినీ ప్రేక్షకులు ప్రతికూలంగా స్పందించడం సినిమా యూనిట్‌కు షాక్ తగిలినట్టయింది. ఈ ట్రైలర్‌కు లైక్స్ కంటే డిస్‌లైక్స్ రావడం, విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు పెట్టడం జరిగింది.

    Mahesh Bhatts Sadak 2 trailer gets most dislikes than likes

    సడక్ 2 సినిమాపై క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ స్పందించారు. ఫాక్స్ స్టార్ హిందీ సంస్థకు మెసేజ్ పెడుతూ.. దయచేసి సడక్ 2 ట్రైలర్‌ కోసం ఫేక్ వ్యూస్, లైక్స్ కొనవద్దు. ఒకవేళ కొంటే ఫేక్ లైక్స్, వ్యూస్ కేసులో బాద్‌షాకు పట్టిన గతే మీకు పడుతుంది. మీపై క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తాను అని కేఆర్కే వార్నింగ్ ఇచ్చారు.

    ఇటీవల బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా అకౌంట్ల కోసం భారీగా డబ్బు చెల్లించి నకిలీ లైక్స్, ఫాలోవర్స్‌ను కొనుగోలు చేసిన కుంభకోణం బయటకు రావడం తెలిసిందే. ఈ కేసులో ముంబై క్రైమ్ పోలీసులు బాదాషాను విచారించిన సంగతి తెలిసిందే.

    English summary
    Uninstall Disney+ Hotstar app Trending: Mahesh Bhatt's directorial Sadak 2 will premiere on Disney+ Hotstar on August 28, 2020. In this occassion, movie unit released trailer of the movie. But Sadak 2 trailer gets most dislikes than likes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X