నోరుమూసుకోకపోతే నిన్నూ చంపేస్తాం... మహేశ్ భట్ బెదిరించాడన్న జియాఖాన్ తల్లి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండస్ట్రీలో ఓ పెద్ద జ్వాలాగ్నినే రగిలించిందని చెప్పాలి. నెపోటిజంపై మునుపెన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. మూవీ మాఫియా చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్న నటి జియాఖాన్ మరణం మళ్లీ తెరపైకి వచ్చింది.
సుశాంత్ మరణం నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నటి జియాఖాన్ తల్లి రబియా ఖాన్ దర్శక నిర్మాత మహేశ్ భట్ తనను బెదిరించిన వైనాన్ని వెల్లడించారు. జియా అంత్యక్రియల సమయంలోనే మహేశ్ భట్, తన వద్దకు వచ్చి, "నోరుమూసుకుని ఉండకపోతే, నీకు కూడా ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తాం, జాగ్రత్త" అంటూ బెదిరించాడని వెల్లడించారు. జియా ఖాన్ మరణంలో హీరో సూరజ్ పంచోలి హస్తముందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక జియా, సుశాంత్ మరణంలోనూ సారూప్యత ఉందని రబియా ఖాన్ వెల్లడించారు. ఇధ్దరినీ ప్రేమ పేరిట మోసం చేశారు, పెళ్లి చేసుకుంటామని వారి వద్ద నుంచి డబ్బు తస్కరించారని, అయిన వారందరికీ దూరం చేసి, చివరకు ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే వారి ఉసురుతీశారని వెల్లడించారు. పోలీసుల తీరుపై తనకు నవ్వొస్తోందని, వారు కేసును ఛేధించకుండా, నిజాన్ని కప్పిపుచ్చడంపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు.
జియా కూడా డిప్రెషన్ బారిన పడిందని కేవలం మహేశ్ భట్ మాత్రమే అన్నారని, ఇంకెవ్వరూ ఆమె గురించి ఆ విధంగా మాట్లాడలేదని రబియా స్పష్టం చేశారు. ఇప్పుడు సుశాంత్ విషయంలోనూ అదే జరుగుతోందని తెలిపింది. మహేశ్ భట్, బాలీవుడ్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా జియాకు న్యాయం జరుగుతుందని, ఇకపై తాను వెనకడుకు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











