పాక్ క్రికెటర్‌ను ఆ సినిమాలో తీసుకోవాలనుకున్నారట, చివరకు ఏమైందంటే?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన అసాధారణమైన ఆట తీరు, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవాడు. ఇండియన్ అభిమానులు అప్పట్లో అతడిని టీమిండియా విలన్‌లా భావించేవారు. దీంతో షోయబ్‌ను తన సినిమాలో విలన్ పాత్రకు తీసుకోవాలని భావించాడట ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్.

మహేష్ భట్ దర్శకత్వంలో 2006లో 'గ్యాంగ్‌స్టర్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ హష్మి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులోని దయా శంకర్ అనే విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా పోషించారు. వాస్తవానికి దయా శంకర్ పాత్రకు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారట.

Mahesh Bhatt wants Shoaib Akhtar for Gangster but he refused

గతంలో ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా షోయబ్ అక్తర్ వెల్లడించారు. తనకు నటించడం కంటే క్రికెట్ ఆడటం అంటేనే ఇష్టం, అందుకే మహేష్ భట్ ప్రపోజల్‌ను రిజక్ట్ చేసినట్లు సదరు ఇంటర్వ్యూలో షోయబ్ వెల్లడించారు. దీంతో పాటు చాలా మూవీ ఆఫర్లు వచ్చాయని, వాటన్నింటినీ రిజక్ట్ చేసినట్లు తెలిపారు.

అదే సమయంలో షోయబ్ అక్తర్ మీద మరో ప్రచారం కూడా జరిగింది. సోయబ్ క్రికెట్ మీద ప్రేమతో మహేష్ భట్ సినిమా ఆఫర్ వదులుకోలేదని, రెమ్యూనరేషన్ నచ్చకే వదులుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంఘమిత్ర చౌదరి మూవీలో కూడా షోయబ్‌కు ఆఫర్ వచ్చిందని, అతడికి రూ. 1 కోటి రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని, అయితే అతడు రూ. 8 కోట్లు డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారట.

కాగా... ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇటీవల ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీద ఆరోపణలు చేసి మరోసారి షోయబ్ అక్తర్ వార్తల్లోకి ఎక్కారు. ఇండియా చేతిలో పాక్ ఓడి పోయిన నేపథ్యంలో అతడిది బ్రెయిన్‌లెస్ కెప్టెన్సీ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X