‘ హీరోలకి వర్జిన్‌ అమ్మాయిలే కావాలి .. ప్రొడ్యూసర్లది అదే పని ’

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న చీకటి కోణాల్ని రోజుకొక సెలబ్రెటీ బయటపెడుతున్నారు. పైకి పెద్ద మనుషుల ముసుగులో కనిపిస్తూ లోపల అరాచకాలు చేసే ఎంతో మంది బాగోతాలు బయటపడ్డాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎవరో ఒకరు తాము అనుభవించిన కష్టాలను , ఇబ్బందులను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మహిమా చౌదరి.. హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mahima Chaudhry opened up about the dark side of the film industry

హీరోల మాటే ఫైనల్

గతంలో చిత్ర పరిశ్రమ దర్శకుడి కనుసన్నల్లో ఉండేది. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా 24 విభాగాలు ఆయన చెప్పినట్లే నడిచేవి. కానీ రాను రాను పరిశ్రమపై హీరోల ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. కథ, కథనాలను మంచి కేవలం హీరోల ఛరిష్మాపైనే సినిమాలు హిట్లు కొడుతూ.. వందలు, వేల కోట్ల వసూళ్లు చేసే పరిస్ధితులు రావడంతో దర్శక నిర్మాతలు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దర్శకుడు కథ తీసుకుని వస్తే నిర్మాత ఎవరు? హీరోయిన్ ఎవరు? కథలో ఎలాంటి మార్పులు చేయాలి? టెక్నీషియన్లు, రెమ్యునరేషన్లు ఇలా సమస్తం హీరోల నిర్ణయంపైనే ఆధారపడింది. సినీ పరిశ్రమలో హీరోల రాజ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు మహిమా చౌదరి.

షారుఖ్ ఖాన్‌తో ఫస్ట్ మూవీ

బెంగాల్‌కు చెందిన మహిమ చౌదరి 90వ దశకంలో బాలీవుడ్‌ను ఒక ఊపారు. వీడియో జాకీగా ప్రస్థానం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 1997లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు అదే పర్దేశ్. ఈ సినిమా ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించడంతో పటు మహిమకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, బెస్ట్ యాక్ట్రెస్ కింద ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత దాగ్ : ద ఫైర్, ప్యార్ కోయి ఖేల్ నహి, దడ్కన్, దివానే, కురుక్షేత్ర, లజ్జ, యా తెర ఘర్ యా మేరా ఘర్, ఓమ్ జై జగదీశ్ తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీకాంత్ సరసన మనసులో మాట చిత్రంలో కనిపించింది.

లియాండర్ పేస్‌తో డేటింగ్

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌‌తో డేటింగ్ చేసిన మహిమా చౌదరి తర్వాత ఆయనతో విడిపోయారు. అనంతరం 2006లో వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని పెళ్లాడగా , ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం. అనివార్య కారణాలతో మహిమా చౌదరి - బాబీ ముఖర్జీలు 2013లో విడిపోయారు. సినిమాలు, టెలివిజన్ ద్వారా ఇప్పటికీ ఆమె ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఎమర్జెన్సీ, నాదనియా చిత్రాలలో నటించారు మహిమ. 50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు మహిమా చౌదరి. ఇప్పటికీ ఆమెకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని కొన్ని ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.

కన్నెపిల్లల వేటలో ప్రొడ్యూసర్లు

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో హీరోల రాజ్యం, ఇతర కార్యకలాపాలపై మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు వర్జిన్ హీరోయిన్లే కావాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్జిన్‌లకు ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందన్నారు. నేటి తరం అమ్మాయిలకు మంచి పాత్రలు, భారీ మొత్తంలో పారితోషికం లభిస్తున్నాయని కానీ మా తరంలో హీరోయిన్ పాత్రలు దక్కాలంటే చాలా కష్టమని మహిమ తెలిపింది. హీరోయిన్లు ఎవరితో డేటింగ్‌లో ఉండకూడదు.. కనీసం ముద్దు అనుభవం కూడా లేని అమ్మాయిల్నే హీరోలు కోరుకునేవాళ్లని చెప్పింది. దర్శక , నిర్మాతలు కూడా కన్నెపిల్లల్ని వెతికేవారని.. హీరోయిన్లకు కనుక పెళ్లయితే మాత్రం వారి కెరీర్ ముగిసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.

More from Filmibeat

Read more about: mahima chaudhry movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X