అప్పుడు రణబీర్ కపూర్ తో సిగరెట్..ఇప్పుడు సీనియర్ నటుడితో కిస్సు, అతడికే సపోర్ట్!
పాకిస్థానీ బ్యూటీ మహీరా ఖాన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఆ మధ్యన రణబీర్ సింగ్ తో కలసి సిగరెట్ కొడుతూ దుమారం లేపింది. మహీరా, రణబీర్ స్మోక్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవడ్ లో దీనిని పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ పిల్ల సెంట్రిక్ గా మరో వివాదం మొదలైంది. పాకిస్తానీ సీనియర్ నటుడు జాదవ్ షేక్ ఓ ఈవెంట్ లో మహీరాని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాదవ్ పై విమర్శలు వెల్లువెత్తుతుంటే ఈ భామ మాత్రం భిన్నంగా స్పందించి ఆశ్చర్య పరిచింది.

రాయిస్ తో ఎంట్రీ
పాకిస్థానీ నటి అయిన మహీరా షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి గుర్తింపు తెచ్చుకుంది.
Recommended Video


రణబీర్ కపూర్ తో కలసి ధూమపానం దుమారం
గత నెలలో మహీరా, రణబీర్ కపూర్ గురించిన వార్తలు దుమారంగా మారాయి. వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. అంతలోనే వీరిద్దరూ కలసి సిగరెట్ కొడుతూ దొరికిపోయారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

క్షమాపణలు
ఈ వివాదంపై స్పందించిన మహీరా క్షమాపణలు కూడా కోరింది. అంతటితో ఆ వివాదానికి తెర పడింది.

తాజగా ముద్దు గొడవ
మరో మారు మహీరా వార్తల్లోకి వచ్చేసింది. ఓ అవార్డు ఫంక్షన్ లో మహీరాని పాక్ సీనియర్ నటుడు జాదవ్ షేక్ బలవంతంగా ముద్దు పట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహీరా బుగ్గపై జాదవ్ ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆమె దూరం జరుగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

జాదవ్ పై విమర్శలు
పాక్ సీనియర్ నటుడు జాదవ్ ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళలతో ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.

షాక్ ఇచ్చిన మహీరా
మహీరా మాత్రం విమర్శలకు భిన్నంగా స్పందించి ఆశ్చర్యపరిచింది. ఈ మాత్రం దానికే ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. జాదవ్ సీనియర్ నటులు, ఆయన మెంటర్ లాంటి వారు అంటూ అతడికే సపోర్ట్ చేయడం అందరిని షాక్ కి గురిచేసింది.


Click it and Unblock the Notifications











