దమ్ము కొట్టింది 'రణవీర్‌'తో కాదు.. 'రణబీర్‌'తో.. అమ్మాయిలకు, అబ్బాయిలకు చాలా కామన్!

పాకిస్థానీ నటి మహీరా ఖాన్ బుల్లి తెర షోలు, బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహీరా అందానికి యువతలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ పాకిస్థానీ భామ మత్తెక్కించే చూపులతో మాయ చేసింది. రాయీస్, యాక్టర్ ఇన్ లా లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని చిత్రాలలో మహీరా నటిస్తోంది. ఇదిలా ఉండగా గత ఏడాది మహీరా ఖాన్, రణబీర్ కపూర కలసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు లీక్ అయ్యాయి. ఇది పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. మహీరా ఖాన్ టార్గెట్‌గా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజగా మరో మారు ఆ వివాదం తెరపైకి వచ్చింది.

హఫీజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ

హఫీజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ

పాకిస్థానీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనితో మహీరాఖాన్ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. చాలా గొప్ప ఆటని ప్రదరించావు. నీ ఆట చూడడానికి ఎప్పుడూ ఇష్టపడతాను అంటూ మహీరా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ అసందర్భమైన కామెంట్స్ చేశాడు. అంతే ఘాటుగా మహీరా రిప్లై ఇచ్చింది.

అప్పటి నుంచి అవకాశాలు

రణవీర్‌తో కలసి సిగరెట్ తాగుతున్న ఫొటోలు లీక్ అయినప్పటి నుంచి మహిరాకు అవకాశాలు రావడం లేదు. అందుకే ఇలా కాలం వెళ్లదీస్తుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనితో మహీరా సింపుల్‌గా, అదిరిపోయే రిప్లై ఇచ్చింది. రణవీర్‌తో కాదు రణబీర్ అని కామెంట్ పెట్టింది. దీనితో మహీరా ఉద్దేశం ఏంటో అతడికి అర్థం అయిపోయింది. సదరు నెటిజన్ రణబీర్‌కి బదులుగా రణవీర్ అని తప్పుగా పేర్కొన్నాడు. దీనికి మహీరా స్పందిస్తూ సిగరెట్ తాగింది రణవీర్‌తో కాదు రణబీర్‌తో అని అర్థం వచ్చేలా స్పందించింది.

చాలా కామన్

చాలా కామన్

ఈ వివాదం గతంలో పెద్ద ఎత్తున చెలరేగిన సమయంలో మహీరా వివరణ ఇచ్చింది. లీక్ అయిన ప్రైవేట్ ఫోటోల గురించి చర్చించడం సరైనది కాదు. అయినా ఒక అమ్మాయి, అబ్బాయి కలసి ప్రైవేట్‌గా సమయం గడపడం ఇప్పుడు చాలా కామన్. అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అని మహీరా పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు కూడా జోరుగా వార్తలు వచ్చాయి.

అదే తొలిసారి

అదే తొలిసారి

నా ప్రైవేట్ సమయాన్ని గడుపుతూ కెమెరాకు దొరకడంనా జీవితంలో అదే తొలిసారి. నేనెప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో తెలియదు అని మహీరా తెలిపింది. ఇక ఎలాంటి సమస్య లేనట్లుగా మా ఫోటోల గురించి జాతీయ స్థాయిలో చర్చలు పెట్టారు. ఇది చాలా దారుణం అని మహీరా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X