అర్భాజ్ ఖాన్‌తో విడాకులు.. ఆ రోజు నా కొడుకు అలా అన్నాడు.. సీక్రెట్స్ బయటపెట్టిన మలైకా
బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా అరోరా వ్యవహారం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె విడాకుల విషయం, తన కంటే ఎంతో చిన్నవాడైన యంగ్ హీరోతో డేటింగ్ ఇలాంటి మసాలా అంశాలతో నిత్యం జనాల నోళ్లలో నానుతూ ఉంటుంది. తాజాగా మలైకా అరోరా.. కరీనా కపూర్ షోలో పాల్గొని తన విడాకుల వెనుకున్న కథ చెప్పుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

విడిపోయిన జంట..
మలైకా అరోరా, అర్భజ్ ఖాన్‌లు 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరి వైవివాహిక బంధంలో అభిప్రాయ భేధాలు తలెత్తడంతో 2107లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఎవరి దారి వారు చూసుకుంటూ బిజీ అయిపోయారు. మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉండగా.. అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. తాజాగా తన గతం గురించి స్పందించిన మలైకా.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

సిద్దంగా ఉన్నావా?
తాను విడాకులు తీసుకోవడం సరైంది కాదని ప్రతి ఒక్కరూ హెచ్చరించేవారని చెప్పుకొచ్చింది. అలాగే తన నిర్ణయానికి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి విడాకులు తీసుకోకపోవడమే మంచిదని సూచించేవారని గుర్తు చేసుకుంది. విడాకులు తీసుకోవడానికి ముందు రోజు రాత్రి కూడా కుటుంబ సభ్యులు సైతం ‘నువ్వు డైవర్స్‌కు సిద్ధంగానే ఉన్నావా?' అని అడిగారని చెప్పుకొచ్చింది.

ఇద్దరం కలిసే..
మనం తీసుకోనే ఓ నిర్ణయం మన జీవితాన్ని సులభంగా సాగిపోనివ్వదని, చివరికి కొంతమందితో నిందలు పడాల్సినా పరిస్థితులను తీసుకువస్తుందని వేదాంతధోరణిలో మాట్లాడింది. అయితే మన కోసం మనచూట్టూ ఉండేవారి కోసం ఇది సరైనదని భావించే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
Recommended Video

ఏది ఆనందం కలిగిస్తే..
ఏ తల్లైనా తన పిల్లలకు సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటుందని పేర్కొంది. తన ముందున్న పరిస్థితుల వల్ల ఆ సమయంలో అర్హాన్ కూడా తనను సమర్ధించాడని తెలిపింది. ఓ రోజు అర్హాన్ తన దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అనందంగా ఉంటావో అదే చేయి.. ఎందుకంటే నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నానని చెప్పినట్టు గుర్తు చేసుకుంది.


Click it and Unblock the Notifications











