వేరొకరితో రిలేషన్లో ఉన్నా... తల్లిగా నా బాధ్యత తగ్గదు: మలైకా అరోరా
బాలీవుడ్ కపుల్ మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ విడిపోయి దాదాపు సంవత్సరాలైంది. భార్యతో విడిపోయిన తర్వాత అర్భాజ్ ఖాన్... జార్జియా ఆండ్రియానీతో ప్రేమలో పడగా, మలైకా అరోరా... అర్జున్ కపూర్‌తో లవ్ రిలేషన్ పెట్టుకున్నారు. కొంతకాలం పాటు అర్జున్-మలైకా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిప్పటికీ ఇటీవల అర్జున్ కపూర్ 34వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం అఫీషియల్‌గా ప్రకటించారు.
అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తాను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పటికీ కుమారుడు అర్హాన్ ఖాన్ తన ఫస్ట్ ప్రియాటీ అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్నేహ పూర్వకంగానే విడిపోయాం, కొడుకే ముఖ్యం
మలైకా మాట్లాడుతూ.. ‘అర్భాజ్ నేను స్నేహ పూర్వకంగా విడిపోయాం. అయితే కుమారుడు అర్హాన్ విషయంలో మా బాధ్యత మరువడం లేదు. విడిపోయిన తర్వాత మేము ఎటు వెళతామో మాకు తెలియదు. కానీ కుమారుడికి ఏ లోటూ రాకుండా చూసుకోవాలనుకున్నాం. ఇప్పటికీ నా ఫస్ట్ ప్రియారిటీ నా కొడుకు మాత్రమే.' అని మలైకా తెలిపారు.

మరొక రిలేషన్ కోసం ప్లాన్ చేయలేదు, అలా జరిగిపోయింది
‘అర్హాన్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. నాకు అదే ముఖ్యం. నా కొడుకు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నా జీవితాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు. అర్భాజ్‌తో విడిపోయిన తర్వాత మరొక రిలేషన్ పెట్టుకోవాలని నిజంగా ప్లాన్ చేయలేదు. కానీ కొన్ని విషయాలు అలా జరిగిపోయాయి.' అని మలైకా తెలిపారు.

నా మొదటి ప్రాధాన్యత అదే
మేము ఇప్పుడు మా జీవితంలో ఒక దశలో ఉన్నాము, అక్కడ మన సంబంధాన్ని ఒకరికొకరు ఉనికిని అంగీకరించడం ద్వారా గౌరవం ఇవ్వాలి. అయితే రిలేషన్ షిప్‌లో ఉండటం వల్ల తల్లిగా నా బాధ్యత ఏ మాత్రం తగ్గదు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పటికీ నా కుమారుడే... అని మలైకా స్పష్టం చేశారు.

పెళ్లి చేసుకుంటారా?
మలైకా అరోరా, అర్జున్ కపూర్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో స్పందించడానికి వీరు ఇష్ట పడటం లేదు. వారి బంధం మరింత బలపడటం చూస్తుంటే ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











