»   » మలైకాతో అక్రమ అఫైర్.. సల్మాన్‌తో రాజీకి అర్జున్ కపూర్ ప్రయత్నం..

మలైకాతో అక్రమ అఫైర్.. సల్మాన్‌తో రాజీకి అర్జున్ కపూర్ ప్రయత్నం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ తారలు అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య అక్రమ బంధం కొనసాగుతున్నదనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడి అర్బాజ్ ఖాన్‌ నుంచి విడిపోయిన తర్వాత ఈ వార్తలు ఊపందుకొన్నాయి. అయితే అఫైర్‌పై అర్జున్ కపూర్ గానీ, మలైకా గానీ పెదవి విప్పలేదు. కానీ మలైకాతో వ్యవహారం సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్ మధ్య చిచ్చు రాజేసిందనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Arjun Kapoor Slams A Website For Its Derogatory Remarks on Janhvi Kapoor
అర్జున్ కపూర్‌తో ఎవరూ నటించొద్దు

అర్జున్ కపూర్‌తో ఎవరూ నటించొద్దు

మలైకాతో అఫైర్ వార్తలు మీడియాలో నానుతుంటే సల్మాన్‌కు అర్జున్ కపూర్ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడట. సల్మాన్ హాజరయ్యే ఈవెంట్లకు కూడా అర్జున్ ముఖం చాటేస్తున్నాడట. అంతేకాకుండా అర్జున్ కపూర్‌తో ఎవరూ కలిసి నటించకూడదని తన సన్నిహితులకు వార్నింగ్ ఇచ్చారట.

సల్మాన్, అర్జున్ మధ్య చిచ్చు

సల్మాన్, అర్జున్ మధ్య చిచ్చు

మలైకా వ్యవహారం ఇద్దరి మధ్య దూరం పెంచుతున్న నేపథ్యంలో సల్మాన్‌తో అర్జున్ కపూర్ రాజీ చేసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. సల్మాన్‌తో సంధి చేసుకోవాలని అర్జున్ నిర్ణయించుకొన్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది.

సల్మాన్‌తో రాజీకి

సల్మాన్‌తో రాజీకి

సల్మాన్‌తో రాజీ కుదుర్చుకొనేందుకు ప్రయత్నాల్లో ఆయన చెళ్లెల్లు అర్బితఖాన్, అల్వీరా ఖాన్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్‌ జైలుశిక్ష పడిన నేపథ్యంలో అర్జున్ కపూర్ స్వయంగా ఫోన్ చేసి తన బాధను పంచుకొన్నారట.

రంగంలోకి సన్నిహితులు

రంగంలోకి సన్నిహితులు

అయితే అర్జున్ కపూర్, సల్మాన్ మధ్య చోటుచేసుకొన్న గ్యాప్‌ను తగ్గించేందుకు కొందరు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. సల్మాన్ ఎవరికీ హానీ తలపెట్టని వ్యక్తి. అర్జున్ కపూర్‌పై ఎలాంటి కోపం లేదు అని సల్మాన్ సన్నిహితులు పేర్కొంటున్నారు.

 అర్జున్ కపూర్‌ మలైకాను వదులుకో

అర్జున్ కపూర్‌ మలైకాను వదులుకో

అర్జున్ కపూర్ తండ్రి బోనికపూర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సల్మాన్ అండగా నిలిచారు. పారితోషికం తీసుకోకుండానే నో ఎంట్రీ చిత్రంలో నటించాడు. అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మలైకా అరోరాకు దూరంగా ఉండాలి అని కొందరు అర్జున్ కపూర్‌కు సూచించారట.

English summary
Arjun Kapoor's closeness to Malaika has caused a rift in his friendship with Salman Khan, as the latter believes that Arjun is the reason behind Malaika's divorce with Arbaaz. Report suggest that, Arjun has been avoiding Salman at events, and maintained a distance from him. The latest report is that Arjun is trying to make peace with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X