మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమలో లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అక్కడ డేటింగ్‌లు, బ్రేకప్‌లు తరచుగా వినిపించే మామూలు అంశాలు. అందుకే ఆ పరిశ్రమలో వీటిని పెద్దగా హైలైట్ చేయరు. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఓ జంట మాత్రం చాలా కాలంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

వాళ్లే.. మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌. వీళ్లిద్దరికి భారీగా ఏజ్ గ్యాప్ ఉండడం.. ఆమెకు అంతకు ముందే పెళ్లవడం వంటి వాటి వల్ల ఈ జోడీ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మలైకా అరోరా.. అర్జున్ కపూర్ జంటగా మాల్దీవులు టూర్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు తీసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

మలైకా.. అర్జున్ కపూర్ కెరీర్‌లు ఇలా

మలైకా.. అర్జున్ కపూర్ కెరీర్‌లు ఇలా

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలో కొన్ని చిత్రాల్లో నటించింది మలైకా అరోరా. నటిగా గుర్తింపును అందుకోలేని ఈ బ్యూటీ.. 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. తెలుగులో 'అతిథి', 'గబ్బర్ సింగ్‌'లో ఐటెం సాంగ్స్ చేసింది.

ఇక, బోనీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుంటూ బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతూ సత్తా చాటుతున్నాడు.

ఇద్దరూ కలిశారు... ప్రకటించేశారుగా

ఇద్దరూ కలిశారు... ప్రకటించేశారుగా

ఎన్నో ఏళ్లుగా అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే ఒప్పుకున్నారు.

కొద్దిరోజుల క్రితం జరిగిన 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా కొద్ది రోజుల క్రితం అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ 'అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది. దీంతో వీళ్ల బంధం గురించి అందరికీ తెలిసిపోయింది.

వయసులో తేడా.. అయిన తగ్గట్లేదు

వయసులో తేడా.. అయిన తగ్గట్లేదు

మలైకా అరోరాతో అర్జున్ కపూర్ డేటింగ్ చేసే విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అవడానికి కారణం.. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడమే. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్‌ (బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు)కు విడాకులు ఇచ్చింది.

33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, మలైకా అరోరాకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆమె అర్జున్‌తో వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది.

వాళ్లింటికి వెళ్లాడు... పెళ్లి మాటలని

వాళ్లింటికి వెళ్లాడు... పెళ్లి మాటలని

చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్న మలైకా అరోరా.. అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు పోస్టులు పెట్టుకోవడం.. రొమాన్స్ చేసుకోవడం.. హాట్ హాట్ కామెంట్లు చేయడం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం అర్జున్ కపూర్.. మలైకా అరోరా ఇంటికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ పార్టీలో అతడు వాళ్లందరితో కలిసి తెగ సందడి చేశాడు. అప్పుడతను వెళ్లింది పెళ్లి గురించి మాట్లాడడానికే అని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.

ఇద్దరూ కలిసి ఒకేచోట ఉంటూ రచ్చ

ఇద్దరూ కలిసి ఒకేచోట ఉంటూ రచ్చ

ప్రేమ వ్యవహారం బహిరంగం అయిన తర్వాత మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కొన్ని నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా కొనుక్కున్నారు. అక్కడే కలసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కలిసే పార్టీలు, పబ్బులను చుట్టేస్తున్నారు. ఇలా దేనికైనా జంటగానే వెళ్తున్నారు. అంతేకాదు, వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సందడి చేసేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరు తరచూ వార్తల్లో ఉంటున్నారు.

లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లారు

లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లారు

సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కావడంతో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఖాళీ సమయాల్లో మాత్రం టూర్లకు వెళ్తుంటారు. ఇప్పటికే ఈ జంట దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశీ పర్యటలను కూడా చేసేశారు. ఇందులో భాగంగానే తాజాగా వీళ్లిద్దరూ జంటగా మాల్దీవులకు చెక్కేశారు. అక్కడ దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి మరీ ఓ కాటేజ్‌ను తీసుకున్నారట. ఇక, రెండు మూడు రోజులుగా మాల్దీవులు బీచ్‌లలో జంటగా రచ్చ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకూ జంటగా తీసుకున్నవి మాత్రం ఈ బాలీవుడ్ జోడీ బయట పెట్టలేదు.

Recommended Video

Malaika Arora Topless Pic Goes Viral | ఘాటు అందాలతో కనువిందు
సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో లీక్

సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో లీక్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా అరోరా, అర్జున్ కపూర్.. మాల్దీవులకు జంటగా వెళ్లినా.. ఒంటరిగా ఉన్న ఫొటోలు, వీడియోలను మాత్రమే షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ కపూర్.. సైక్లింగ్ చేస్తుండగా తీసుకున్న ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో మలైకా కూడా అతడి వెనుక సైక్లింగ్ చేస్తూ వస్తుంది. కానీ, ఈ వీడియో తీసిన విషయం మాత్రం ఆమెకు తెలియదట. ఈ విషయాన్ని అర్జునే స్వయంగా వెల్లడించాడు. ఇక, వీళ్లిద్దరూ పెళ్లి కాకున్నా ఒకే చోట ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అతడు పరోక్షంగా వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X