సినీ జంటకు కరోనా దెబ్బ: స్టార్ హీరోకు పాజిటివ్.. ఒంటరిగా నటి.. ఏకంగా ఆ హాట్ ఫొటో లీక్ చేసి మరీ!

ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నిత్యం అక్కడ ఇలాంటి వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ పరిశ్రమలోని వాళ్లకు డేటింగ్‌లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణమైన విషయాలు కావడమే. ఇప్పుడు కూడా అక్కడ ఎన్నో జంటలు ఉన్నాయి. అందులో మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌ జోడీ మాత్రం చాలా కాలంగా హైలైట్ అవుతోంది. దీనికి కారణం.. వీళ్లిద్దరికి భారీగా ఏజ్ గ్యాప్ ఉండడంతో పాటు ఆమెకు అంతకు ముందే పెళ్లై విడాకులు కూడా తీసుకోవడమే. ఇక, ఇటీవలే అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మలైకా అరోరా ఒంటరితనాన్ని తాళలేకపోతోంది. ఈ నేపథ్యంలో అతడితో దిగిన ఓ ప్రైవేట్ ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Recommended Video

Arjun Kapoor & Malaika Arora Relation Gearing Up Heat In Bollywood || Filmibeat Telugu
మలైకా కెరీర్ అలా.. అర్జున్ కెరీర్ ఇలా

మలైకా కెరీర్ అలా.. అర్జున్ కెరీర్ ఇలా

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది మలైకా అరోరా. నటిగా గుర్తింపును అందుకోలేని ఈ బ్యూటీ.. 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. తెలుగులో 'అతిథి', 'గబ్బర్ సింగ్‌'లో ఐటెం సాంగ్స్ చేసింది. ఇక, బోనీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుంటూ బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకుని దూసుకుపోతున్నాడు.

ఇద్దరి మధ్య ప్రేమ... షోలో ప్రకటించి

ఇద్దరి మధ్య ప్రేమ... షోలో ప్రకటించి

సుదీర్ఘ కాలంగా అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం దేశ వ్యాప్తంగా చాలా మందికి తెలుసు. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే ఒప్పుకున్నారు. కొన్నేళ్ల క్రితం 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా ఆ వెంటనే అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ 'అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది. దీంతో వీళ్ల బంధం అధికారికంగా తెలిసినట్లైంది.

ఏజ్ గ్యాప్ ఉన్నా.. అస్సలు తగ్గట్లేదు

ఏజ్ గ్యాప్ ఉన్నా.. అస్సలు తగ్గట్లేదు

అర్జున్ కపూర్.. మలైకా అరోరాతో డేటింగ్ చేసే విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అవడానికి కారణం.. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడమే. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా.. భర్త అర్భాజ్ ఖాన్‌ (బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు)కు విడాకులు ఇచ్చింది. 33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, మలైకా అరోరాకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆమె అర్జున్‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

పెళ్లి కాకుండానే ఒకేచోట కలిసుంటూ

పెళ్లి కాకుండానే ఒకేచోట కలిసుంటూ

డేటింగ్ గురించి ప్రపంచానికి చెప్పేసిన తర్వాత మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కొన్ని నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా కొనుక్కున్నారు. అక్కడే కలసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కలిసే పార్టీలు, పబ్బులను చుట్టేస్తున్నారు. ఇలా దేనికైనా జంటగానే వెళ్తున్నారు. అంతేకాదు, వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సందడి చేసేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరు తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.

అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ రాగా

అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ రాగా

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఆయన కొడుకు, స్టార్ హీరో అర్జున్ కపూర్, కూతురు అన్షులా కపూర్, అనిల్ కపూర్ కూతురు రియా కపూర్, ఆమె భర్త కరణ్ బులానీ‌లు ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రియా కపూర్ న్యూ ఇయర్‌కు ముందే తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ ఒక హోటల్‌లో ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతావారందరు తమ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇలా మలైకాకు, అర్జున్‌కు దూరం పెరిగింది.

అక్కడ ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటూ

అక్కడ ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటూ


కొంత కాలంగా సినిమాల్లో నటించకున్నా.. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది మలైకా అరోరా. అదే సమయంలో ఎప్పుడూ యోగాలు చేస్తుంటుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోందామె. మరీ ముఖ్యంగా ప్రియుడు అర్జున్ కపూర్‌తో దిగిన పర్సనల్, ప్రైవేట్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. దీంతో అప్పుడప్పుడూ విమర్శలనూ ఎదుర్కొంటోందీ బాలీవుడ్ సుందరాంగి.

పర్సనల్ ఫొటోను షేర్ చేసిన మలైకా

పర్సనల్ ఫొటోను షేర్ చేసిన మలైకా

న్యూ ఇయర్ సందర్భంగా మలైకా అరోరా ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి కొద్ది రోజుల క్రితం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో తీసుకున్న పిక్ ఇది. ఇందులో అర్జున్ షర్ట్ లేకుండా కనిపించగా.. మలైకా మాత్రం క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఈ ఫొటోను షేర్ చేస్తూ 'ఐ మిస్ యూ మై పౌటీ (అర్జున్ కపూర్). నీ కంటే నా పౌటీనే చాలా బెటర్. హ్యాపీ న్యూ ఇయర్' అంటూ రాసుకొచ్చింది మలైకా. దీంతో ఈ పిక్‌తో పాటు ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ జంట మళ్లీ చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X