Malaika Arora Wedding: యువ హీరోతో మలైకా పెళ్లి.. వీరి గోల మళ్ళీ మొదలైంది.. నిశ్చితార్థం ఎప్పుడంటే?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంతమంది యువ హీరోలు హీరోయిన్స్ పెళ్లితో వారి సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఒక విధంగా గతంలో డేటింగ్ ఎక్కువ కాలం పాటు కొనసాగేది. కానీ ఇప్పుడు ఐదేళ్ల ప్రేమ యాత్రల తరువాత తొందరగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఇక ఈ లిస్టులో మరొక సీనియర్ స్టార్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. వారు మరెవరో కాదు మలైకా అరోరా అర్జున్ కపూర్ అని తెలుస్తోంది. త్వరలోనే మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్ళీ బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఐటెమ్ సాంగ్స్ తో క్రేజ్
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మలైకా అరోరా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ నటిగా పెద్దగా అవకాశాలు అందుకోకపోయినప్పటికీ కూడా ఐటెం సాంగ్స్ తో మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆఫర్లు వచ్చిన రాకపోయినా కూడా అమ్మడు మాత్రం వివిధ రకాల రియాలిటీ షోలతో కూడా తన క్రేజ్ పెంచుకుంది.

గ్లామర్ తో మతిపోగొట్టేలా..
మలైకా అరోరా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ అయితే హై రేంజ్ లో ఉండేలా చూసుకుంటుంది. ఇక బికినీ అందాలతో తరచుగానే ఫాలోవర్స్ మతి పోగొడుతూనే ఉంటుంది.

యువ హీరోతో డేటింగ్
మలైకా అరోరా ఐదు పదుల వయసులోకి వస్తున్నప్పటికీ కూడా ఇంకా తన గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకొని 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక మలైకా ఆ తరువాత బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది.

క్లారిటీ లేకుండా డేటింగ్
అర్జున్ కపూర్ తో దాదాపు నాలుగేళ్ళకు పైగా రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మీడియా ముందు మాత్రం ఎప్పుడూ కూడా వీరి ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చింది లేదు. ముఖ్యంగా అర్జున్ కపూర్ అయితే డేటింగ్ చేయడం అంటే కూడా తనకు ఇష్టమంటూ ఇప్పట్లో చేసుకునే ఆలోచనలో లేను అని చెప్పింది. కానీ అప్పుడప్పుడు మలైకా మాత్రం పెళ్లి గురించి చిన్న చిన్న హిట్స్ అయితే ఇస్తూనే ఉంది.

సీక్రెట్ గా పెళ్లి?
లాక్ డౌన్ లో అయితే మలైకా అర్జున్ కపూర్ ఇద్దరూ కూడా ఓకే ఫ్లాట్లో చాలా రోజులపాటు ఉన్నారు. అయితే వారి పెళ్లి గురించి అప్పట్లోనే అనేక రకాలు కథనాలు వెలువడ్డాయి. గత ఏడాదిలోనే మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరూ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట వారి కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొనే అవకాశం లేకుండా వారు జాగ్రత్తలు తీసుకుని కేవలం అతిపెద్ద మంది స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లుగా గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

ఈసారైనా నిజమవుతుందా?
అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు సిద్ధమవుతున్నట్లుగా మరికొన్ని కథనాలు వస్తున్నాయి. ఇద్దరు కూడా సమ్మర్ అనంతరం పెళ్లి చేసుకునే అవకాశం ఉందట. ఇక వచ్చే నెలలోనే నిశ్చితార్థం జరగవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఇదివరకే చాలాసార్లు ఈ తరహా రూమర్స్ అయితే బాలీవుడ్లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇచ్చింది లేదు. మరి ఈ సరైన ఈ వార్త నిజం అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











