ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

సినీ రంగంలో ప్రేమాయణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. నటీ నటుల మధ్యనో, నటులు టెక్నీషియన్ల మధ్యనో ఇలాంటి వ్యవహారాలు సాధారణంగా నడుస్తూనే ఉంటాయి. ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ డేటింగ్‌లు, బ్రేకప్‌లు తరచుగా వినిపించే మామూలు అంశాలు. అందుకే ఆ పరిశ్రమలో వీటిని పెద్దగా హైలైట్ చేయరు. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఓ జంట మాత్రం చాలా కాలంగా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. వాళ్లే.. మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌. వీళ్లిద్దరికి భారీగా ఏజ్ గ్యాప్ ఉండడం.. ఆమెకు అంతకు ముందే పెళ్లవడం వంటి వాటి వల్ల ఈ జోడీ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మలైకా అరోరా.. అర్జున్ కపూర్ ఒకే ఇంట్లో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..

 మలైకా అరోరా అలా.. అర్జున్ కపూర్ ఇలా

మలైకా అరోరా అలా.. అర్జున్ కపూర్ ఇలా

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేసింది మలైకా అరోరా. నటిగా గుర్తింపును అందుకోలేని ఈ బ్యూటీ.. 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. తెలుగులో 'అతిథి', 'గబ్బర్ సింగ్‌'లో ఐటెం సాంగ్స్ చేసింది. ఇక, అర్జున్ కపూర్.. బోనీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుంటూ బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఇద్దరి మధ్య ప్రేమాయణం.. ప్రకటించారుగా

ఇద్దరి మధ్య ప్రేమాయణం.. ప్రకటించారుగా

చాలా కాలంగా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే ఒప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా కొద్ది రోజుల క్రితం అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ 'అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది. దీంతో వీళ్ల బంధం బహిరంగం అయిపోయింది.

ఆమెకు ఇద్దరు పిల్లలు.. వయసులో తేడా

ఆమెకు ఇద్దరు పిల్లలు.. వయసులో తేడా

మలైకా అరోరాతో అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్నాడన్న విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అవడానికి కారణం.. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడమే. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్‌ (బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు)కు విడాకులు ఇచ్చింది. 33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, మలైకా అరోరాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆమె అర్జున్‌తో వ్యవహారం నడుపుతోంది.

ఇంటికి వెళ్లి మరీ సందడి.. పెళ్లికి సిద్ధంగానే

ఇంటికి వెళ్లి మరీ సందడి.. పెళ్లికి సిద్ధంగానే

ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తోన్న మలైకా అరోరా.. అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు పోస్టులు పెట్టుకోవడం.. రొమాన్స్ చేసుకోవడం.. హాట్ హాట్ కామెంట్లు చేయడం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం అర్జున్ కపూర్.. మలైకా అరోరా ఇంటికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ పార్టీలో అతడు వాళ్లందరితో కలిసి తెగ సందడి చేశాడు. అప్పుడతను వెళ్లింది పెళ్లి గురించి మాట్లాడడానికే అని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇద్దరూ కలిసి ఒకేచోట.. కాపురం పెట్టేశారు

ఇద్దరూ కలిసి ఒకేచోట.. కాపురం పెట్టేశారు

ప్రేమ వ్యవహారం బహిరంగం అయింది కదా ఇంకేంటి అనుకుంటున్నారో.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఆలోచిస్తున్నారో కానీ.. మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కొన్ని నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా కొనుక్కున్నారు. అక్కడే కలసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కలిసే పార్టీలు, పబ్బులను చుట్టేస్తున్నారు. ఇలా దేనికైనా జంటగానే వెళ్తున్నారు. దీంతో వీళ్లిద్దరు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్

ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్

అటు మలైకా అరోరా.. ఇటు అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తమ తమ కెరీర్‌లకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అదే సయమంలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలనే తరచూ తామిద్దరం కలిసున్న ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అర్జున్ కపూర్, మలైకా అరోరా పలు ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఇద్దరూ ఒకే ఇంట్లో ఏకాంతం ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థం అయింది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు

అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు

తాజాగా అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకున్నాడు. ఇందులో మలైకా అరోరా అదిరిపోయే క్లీవేజ్ షో చేస్తూ ఏదో పని చేస్తూ కనిపించింది. ఆ వెంటనే ఆమె కూడా ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో అర్జున్ కపూర్ ఒంటిపై బట్టలు లేకుండా కనిపించాడు. వీళ్లిద్దరూ పంచుకున్న ఫొటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉంది. దీంతో ఈ జంట కలిసే ఉంటున్నారని, తెగ ఎంజాయ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X