twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓకే రూమ్‌లో ఎంజాయ్ చేస్తున్న హీరో హీరోయిన్.. పెళ్లి విషయం ఎత్తితే ఇదీ సమాధానం!

    |

    బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య డేటింగ్, రూమ్ షేరింగ్ లాంటివి కామనే. లవ్ చేసుకుంటున్నారంటూ సంవత్సరాల కొద్ది కలిసి తిరిగి చివరకు కట్ చేసుకునే జంటలు కొన్ని కాగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యే జంటలు మరికొన్ని. ప్రేమ పక్షుల్లా విహరించిన జంటలు ఠకీమని ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రేమజంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఏమంటున్నారో చూడండి.. వాళ్ళ మాటలు విని షాక్ అవుతున్నారు బీ టౌన్ జనం.

    నయా జనరేషన్‌లో ఎలా ఉండాలో అలాగే..

    నయా జనరేషన్‌లో ఎలా ఉండాలో అలాగే..

    నయా జనరేషన్‌లో ఏ విషయంలోనైనా స్పీడ్‌గా ఉండాల్సిందే. కానీ ఈ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమ జంట మాత్రం మరింత జోష్‌లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా రిలేష‌న్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ న్నాళ్లు బ‌య‌టికి తెలియ‌కుండా త‌మ బంధాన్ని కొనసాగించారు. వీరి పెళ్లిపై ఇంట్లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇక ఆకాశమే హద్దుగా గాల్లో విహరిస్తున్నారు.

    ఓపెన్ అయిపోయి.. చివరకు ఓకే రూమ్‌లో

    ఓపెన్ అయిపోయి.. చివరకు ఓకే రూమ్‌లో

    మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎవ్వరికో భయపడాల్సిన అవసరం లేడనట్లుగా ఈ ఇద్దరూ ఓకే రూమ్‌లో సహజీవనం చేస్తూ కాలాన్ని ఎంజాయ్ చేస్తుండటం బీ టౌన్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. పైగా తమ ప్రేమ సంగతులను మీడియా ముఖంగా చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు అర్జున్ కపూర్.

    తనకంటే 12 ఏళ్ళు పెద్దదైన మలైకాతో

    తనకంటే 12 ఏళ్ళు పెద్దదైన మలైకాతో

    మలైకా అరోరా వయసు 45 సంవత్సరాలు. అదే అర్జున్ కపూర్ వయసు కేవలం 33 సంవత్సరాలు. అయినా ఈ విషయంలో కూడా రాజీపడి తనకంటే 12 ఏళ్ళు పెద్దదైన మలైకాతో యమ ఎంజాయ్ చేసేస్తున్నాడు అర్జున్ కపూర్. తమ రిలేషన్ విషయమై దేన్నీ దాచడం లేదు అర్జున్ కపూర్.

    దానికి ఓకే గానీ పెళ్లి మాత్రం కష్టమే

    దానికి ఓకే గానీ పెళ్లి మాత్రం కష్టమే

    ఏదీ దాచుకొని అర్జున్ కపూర్.. మలైకాతో పెళ్లి విషయంలో మాత్రం దాటేస్తూ రావడం విశేషం. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు అర్జున్ కపూర్. దీంతో ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ ముదురు జంట.. ఇక పెళ్ళెప్పుడు చేసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Arjun Kapoor said that whenever he decides to get married to Malaika Arora, he will announce his wedding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X