Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వారిది అక్రమ సంబంధం అనేవారి నోరు మూతపడనుంది: పెళ్లి డేట్ ఫిక్స్?
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్.. కొంతకాలంగా నటి మలైకా అరోరాతో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిది మామూలు ప్రేమ బంధం అయితే ఎవరూ అన్నేసి మాటలు అనేవారు కాదు కానీ, మలైకా అరోరా తన భర్తతో విడిపోవడం, దానికి కారణం అర్జున్ కపూర్‌తో ఉన్న ఎఫైరే కారణమనే వార్తలు రావడంతో... చాలా మంది వీరి బంధాన్ని అక్రమసంబంధంగా విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఈ జంట ఆ విమర్శలేవీ పట్టించుకోవడం లేదు. అయితే త్వరలో ఇలా విమర్శలు చేసేవారి నోరు మూతపడనుంది. అర్జున్-మలైకా పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా?
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం మలైకా అరోరా-అర్జున్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఏప్రిల్ 19న వీరి వివాహ తేదీ నిశ్చయమైందట. ఈ పెళ్లి వేడుక బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరుగబోతున్నట్లు సమాచారం.
ఏ విషయాలు బయటకు చెప్పడం లేదు
ఓ వైపు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే... తమ రిలేషన్ గురించి మాట్లాడటానికి ఇష్టపడని మలైకా-అర్జున్.. పెళ్లి విషయంలో కూడా నోరు మెదపడం లేదు. ‘మీడియాలో వస్తున్న రూమర్లకు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని క్రియేట్ చేసింది వారే' ఇటీవల మలైకా ఓ చాట్ షోలో వ్యాఖ్యానించారు.
విడాకులు ఇవ్వడం బాధలేదు.. స్వేచ్ఛ లభించింది.. జీవితం కొత్తదనం కోరుకొంటున్నది
అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి...
అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి ఇండైరెక్టుగా స్పందిస్తూ... ‘జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలా అని లైఫ్ అక్కడే ఆగిపోకూడదు. ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ తోడు అనేది అవసరమే, మనల్ని ప్రేమించే వ్యక్తులు మనతో ఉన్నపుడు సంతోషంగా ఉంటాము' అని పేర్కొన్నారు.
పెళ్లితో నెక్ట్స్ లెవల్..
మలైకా, అర్జున్ కపూర్ బాలీవుడ్ ఫంక్షన్లకు హాజరవ్వడం ద్వారా తమ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.