twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిది అక్రమ సంబంధం అనేవారి నోరు మూతపడనుంది: పెళ్లి డేట్ ఫిక్స్?

    |

    బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్.. కొంతకాలంగా నటి మలైకా అరోరాతో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిది మామూలు ప్రేమ బంధం అయితే ఎవరూ అన్నేసి మాటలు అనేవారు కాదు కానీ, మలైకా అరోరా తన భర్తతో విడిపోవడం, దానికి కారణం అర్జున్ కపూర్‌తో ఉన్న ఎఫైరే కారణమనే వార్తలు రావడంతో... చాలా మంది వీరి బంధాన్ని అక్రమసంబంధంగా విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఈ జంట ఆ విమర్శలేవీ పట్టించుకోవడం లేదు. అయితే త్వరలో ఇలా విమర్శలు చేసేవారి నోరు మూతపడనుంది. అర్జున్-మలైకా పెళ్లి చేసుకోబోతున్నారు.

    పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా?

    పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా?

    బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం మలైకా అరోరా-అర్జున్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఏప్రిల్ 19న వీరి వివాహ తేదీ నిశ్చయమైందట. ఈ పెళ్లి వేడుక బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరుగబోతున్నట్లు సమాచారం.

    ఏ విషయాలు బయటకు చెప్పడం లేదు

    ఏ విషయాలు బయటకు చెప్పడం లేదు

    ఓ వైపు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే... తమ రిలేషన్ గురించి మాట్లాడటానికి ఇష్టపడని మలైకా-అర్జున్.. పెళ్లి విషయంలో కూడా నోరు మెదపడం లేదు. ‘మీడియాలో వస్తున్న రూమర్లకు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని క్రియేట్ చేసింది వారే' ఇటీవల మలైకా ఓ చాట్ షోలో వ్యాఖ్యానించారు.

    విడాకులు ఇవ్వడం బాధలేదు.. స్వేచ్ఛ లభించింది.. జీవితం కొత్తదనం కోరుకొంటున్నదివిడాకులు ఇవ్వడం బాధలేదు.. స్వేచ్ఛ లభించింది.. జీవితం కొత్తదనం కోరుకొంటున్నది

    అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి...

    అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి...

    అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి ఇండైరెక్టుగా స్పందిస్తూ... ‘జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలా అని లైఫ్ అక్కడే ఆగిపోకూడదు. ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ తోడు అనేది అవసరమే, మనల్ని ప్రేమించే వ్యక్తులు మనతో ఉన్నపుడు సంతోషంగా ఉంటాము' అని పేర్కొన్నారు.

    పెళ్లితో నెక్ట్స్ లెవల్..

    పెళ్లితో నెక్ట్స్ లెవల్..

    మలైకా, అర్జున్ కపూర్ బాలీవుడ్ ఫంక్షన్లకు హాజరవ్వడం ద్వారా తమ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

    English summary
    According to a report in Bollywood website, Malaika Arora and Arjun Kapoor wedding on April 19 this year in the presence of family and close friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X