కపూర్ కుటుంబంలో చిచ్చు... మలైకా, అర్జున్‌ను ఆపడం కష్టమే.. ఇళ్లు కూడా వెతికేస్తున్నారట!
బాలీవుడ్‌లో అఫైర్ల వార్తలకు ఎప్పుడూ కొదవ ఉండదు. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమను మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట ఊపేస్తున్నది. వీరిద్దరి పెళ్లి జరుగుతుందా లేదా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే బోనికపూర్ తనయుడు అర్జున్ కపూర్‌కు ఇంకా పెళ్లికాలేదు. కానీ మలైకా అరోరాకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత అర్జున్‌కపూర్‌తో ప్రేమలో పడింది. ఈ పెళ్లిపై సల్మాన్ కూడా గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి వెనుక ఏం జరుగుతున్నదంటే

షాకిచ్చిన అర్జున్ కపూర్
ఇటీవల కరణ్ జోహర్ హోస్ట్‌గా ఉండే కాఫీ విత్ కరణ్ షోకు అర్జున్ కపూర్ హాజరయ్యాడు. అప్పడే మలైకాతో అఫైర్ గురించి మనసులో మాట చెప్పేశాడు. అప్పటి వరకు డేటింగ్, మీటింగ్ అనుకొన్న వారికి షాక్ తగిలింది. దాంతో మలైకా, అర్జున్ పెళ్లి చేసుకొంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఈ ఏడాదే వివాహం
ఇప్పుడు అందరూ అనుకొన్నట్టే మలైకా, అర్జున్ తమ బంధాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారట. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారట. పెళ్లి తర్వాత ఉండేందుకు ముంబైలో ఇంటిని వెతుకుతున్నట్టు బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

నూతన గృహం కోసం వెతుకులాట
పెళ్లి తర్వాత తమ దాంపత్య జీవితానికి అనుగుణంగా ఉండే ఇంటి కోసం రియల్ ఎస్టేట్ కంపెనీని ఇటీవల సంప్రదించారని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. త్వరలోనే ఓ ఇంటిని ఫైనలైజ్ చేసి పెళ్లికి ముహుర్తాలు పెట్టుకోవాలనే ఆలోచనలో మలైకా, అర్జున్ ఉన్నట్టు సమాచారం.

పెళ్లిపై కపూర్ ఫ్యామిలి అభ్యంతరాలు
కానీ కపూర్ కుటుంబంలో అర్జున్ కపూర్ పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. చిన్నాయన అనిల్ కపూర్, సోదరి సోనమ్ కపూర్ వీరి పెళ్లిపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. మలైకాతో అర్జున్ పెళ్లి జరిగితే కపూర్ కుటుంబంలో విభేదాల తలెత్తడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు.

అర్జున్ కపూర్ కెరీర్ ఇలా
ఇదిలా ఉండగా, అర్జున్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. పరిణితి చోప్రాతో కలిసి సందీప్ ఔర్ పింకీ ఫరార్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అశుతోష్ గోవారికర్ రూపొందించే చిత్రం పానిపట్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం గుండు కూడా కొట్టించుకొన్నాడు.


Click it and Unblock the Notifications











