ఆంటీతో కుర్ర హీరో సహజీవహం.. పార్టీ ఇచ్చి అధికారికంగా ప్రకటన!
ఓ వైపు మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేస్తుంటే.. మరోవైపు యంగ్ అర్జున్ కపూర్, ముదురు బ్యూటీ మలైకా అరోరా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా రోజులుగా వీరి మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతోందని రూమర్స్ బాలీవడ్ లో వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరూ చెట్టపట్టాలు ఏసుకుని కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. మలైకా అరోరా అర్జున్ కపూర్ కన్నా 12 ఏళ్ళు వయసులో పెద్ద. వీరి మధ్య ప్రేమ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మరో సంచలన విషయం ప్రచారం జరుగుతోంది.

మిలాన్ టూర్ నుంచి
కొద్దిరోజుల క్రితం వరకు మలైకా, అర్జున్ కపూర్ మిలాన్ టూర్ లో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మలైకా అరోరా 45 వ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ ఇండియాకు తిరిగి వచ్చారు. ఓ టివి కార్యక్రమంలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

పార్టీ ఇచ్చి మరీ
మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్నేహితలకు పెద్ద పార్టీ అరేంజ్ చేసి తామిద్దరం కలసి జీవించబోతున్నట్లు ప్రకటించబోతున్నారట. శుక్రవారం రోజు ఈ పార్టీ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ సహజీవనాన్ని అధికారికం చేసుకునేందుకే వీరిద్దరూ ఇటీవల ఎక్కువగా పబ్లిక్ లో దర్శనం ఇస్తున్నారని అంటున్నారు.

కారణం అర్జున్ కపూర్
మలైకా అరోరా అర్జున్ కపూర్ తో సన్నిహితంగా మెలగడం వలనే ఆమెకు అర్భాజ్ ఖాన్ దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. మలైకా, అర్భాజ్ ఖాన్ విడిపోవడానికి ఒకరకంగా అర్జున్ కపూర్ ప్రధాన కారణం అని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

అందాల ఆరబోతతో
హాట్ ఐటం సాంగ్స్, గ్లామర్ రోల్స్ తో మలైకా అరోరా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా మలైకా గబ్బర్ సింగ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. భవిషత్తులో మలైకా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











