అర్జున్ కపూర్, మలైక పెళ్లి సీక్రెట్ లీక్.. ఇక ఆపేయ్ అంటున్నా చెప్పేశాడు!
అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య సాగుతున్న ఎఫైర్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్ళై విడాకుల తీసుకున్న ఈ 45 ఏళ్ల ముదురు సుందరితో అర్జున్ కపూర్ సాగిస్తున్న ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. చాలా కాలంగా సహజీవనంలో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారనేది లేటెస్ట్ టాక్. అర్జున్ కపూర్, మలైకా కూడా పబ్లిక్ గానే తిరుగుతున్నారు. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో మలైకా, అర్జున్ కపూర్ మ్యారేజ్ సీక్రెట్ బయట పడింది.

నిర్మొహమాటంగా
కాఫీ విత్ కరణ్ షోలో పలువురు సెలెబ్రిటీలతో చిట్ చాట్ జరుగుతూ ఉంటుంది. ఈ షోకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత జీవితాల గురించి ఏ షోలో కరణ్ జోహార్ నిర్మొహమాటంగా ప్రశ్నలు అడుగుతుండడంతో బాగా పాపులర్ అయింది.

అందరికీ తెలిసేలా
వాస్తవానికి మలైకా, అర్జున్ కపూర్ ప్రేమ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోంది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ పబ్లిక్ గా కనిపించలేదు. ఊహాగానాలు వినిపిస్తున్నా తమ రిలేషన్ షిప్ ని రహస్యంగానే కొనసాగించారు. కానీ ఇటీవల వీరి వ్యవహారం చూస్తుంటే తమ గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే పబ్లిక్ గా తిరుగుతున్నట్లు ఉంది.

మలైకా చేయి పట్టుకుని
కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల అమిర్ ఖాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మలైకా అరోరా కూడా ఈ షోకు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. షో మధ్యలో వీరిద్దరూ మలైకాతో డాన్స్ చేయడానికి ఆమె చేయి పట్టుకుని తీసుకుని వచ్చారు. సందర్భంగా కరణ్ జోహార్.. మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

సీక్రెట్ లీక్
మలైకా, అమిర్ ఖాన్ డాన్స్ చేస్తున్న సమయంలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. త్వరలో మలైకా జీవితానికి సంబంధించిన ఓ కార్యక్రమం జరగబోతోంది. అప్పుడు కూడా ఆమెతో డాన్స్ చేస్తా అంటూ పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. కరణ్ ఈ వ్యాఖ్యలు చేయగానే.. ఇక చాలా ఆపు.. ఇక ఆపేయ్ అంటూ వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











