కన్యత్వం ఎప్పుడు కోల్పోయావ్...కొడుకు ముందే ఓపెనైనా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. మలైకా హిందీ ఐటమ్ సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించింది. 50 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఈ వయస్సులో కూడా తన అందాలను ఆరబోస్తుంటుంది. మలైకా జిమ్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అమ్మడు ఏ రేంజ్‌లో అందాలు ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

హాట్ హాట్ ఫోజులతో మలైకా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. అందాల ఆరబోతలో మలైకా ఎటువంటి హద్దులు పెట్టుకున్నట్టు అనిపించదు. సోషల్ మీడయాలో మలైకా రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తుంది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

అర్బాజ్ ఖాన్‌తో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా రిలేషన్‌షిప్‌లో ఉంది. తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ భామ తన కొడుకు అర్హాన్ ఖాన్‌తో కలిసి వోడ్‌కాస్ట్ 'డంబ్ బిర్యానీ' అనే షోలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రొమోలో విడుదల చేశారు. షోలో భాగంగా నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్? అని కొడుకు అర్హాన్‌ను మలైకా ప్రశ్నించింది అడిగింది. ఈ ప్రశ్నకు అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ప్రశ్నకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేయగా, జవాబు ఇవ్వాల్సిందే అని కొడుకును మలైకా పట్టుపట్టింది.
ఆ వెంటనే తల్లికి ఓ షాకింగ్ ప్రశ్న అడిగాడు అర్హాన్. అమ్మా.. నువ్వు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నావ్? అని అడిగాడు. ఆ ప్రశ్నకు మలైకా ఎలాంటి సమాధానం చెప్పింది? అనే విషయం మాత్రం చూపించలేదు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తల్లీ కొడుకులు మాట్లాడుకోవాల్సిన మాటలేనా ఇవి? అంటూ మండిపడ్డుతున్నారు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరువాత వీరు ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇచ్చారనేది తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











