twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యోగ పోజుతో కేక పుట్టిస్తున్న భామ.. అలా చేస్తే స్ట్రెస్ దూరమవుతుందట

    |

    కెవ్వు కేక పాట తో తెలుగు నాట కేక పుట్టించిన మలైకా అరోరా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. నలభై ఏళ్లు దాటినా.. ఇంకా పాతికేళ్ల కుర్ర పిల్లలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భర్త అర్జాజ్ ఖాన్‌తో తెగతెంపులు చేసుకొని.. ఇప్పుడు కుర్రకారు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నది. ప్రియుడితో రొమాన్స్‌లో మునిగి తేలుతూనే యోగా పాఠాలతో ఆలరిస్తున్నది. వివరాల్లొకి వెళితే...

    హీటెక్కించే ఫొటోలతో షేక్ చేస్తోంది...

    హీటెక్కించే ఫొటోలతో షేక్ చేస్తోంది...

    ఈ భామ కు యువ హీరో..అర్జున్ కపూర్ కు ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి మాట మాత్రం ఎత్తరు. ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా దాటవేస్తారు. వీరిద్దరి మధ్య అంత వయోభేదం ఉంది కాబట్టే. ఈ జంట అంత ఫేమస్ అవుతోంది. ఇక మలైలా తన అందాలను సోషల్ మీడియాలో అలా అలా చూపిస్తూ.. పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

    ఫిట్నెస్ కు అత్యంత ప్రాముఖ్యం..

    ఫిట్నెస్ కు అత్యంత ప్రాముఖ్యం..

    నలభై ఏళ్లు వచ్చినా ఇంకా తన ఫిజిక్ ను అలా మెయింటైన్ చేస్తుండటం తో అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయితే నిత్యం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.. లేదా యోగ చేస్తూ గడుపుతూ ఉంటుంది. ఇలా తనకున్న యోగ పరిజ్ఞానాన్ని తన అభిమానులకు కూడా పంచుతూ ఉంటుంది.

    భుజంగాసనంతో ఎన్నో లాభాలట..

    భుజంగాసనంతో ఎన్నో లాభాలట..

    భుజంగాసనం వేస్తే ఎన్నో లాభాలున్నాయని చెప్తూ.. ఆసనం వేసిన ఫోటోను షేర్ చేసింది. ఇది వెన్నుముక ఫ్లెక్సిబులిటీ గా ఉండేందుకు, స్ట్రెస్ ను తగ్గించుకునేందుకు, మైండ్ ను ప్రశాంతంగా ఉంచేందుకు ఉపయోగ పడుతుందని తెలిపింది. ఇక ఈ పోజ్లో మలైకా ఆదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మలైకా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ సైతం ఈ పోస్ట్ కి లైక్ కొట్టాడు.

    ప్రియుడితో తెగ రొమాన్స్

    ప్రియుడితో తెగ రొమాన్స్

    ఇక అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తెగ రొమాన్స్ చేయడం మీడియాకు పండుగగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకొంటారనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేస్తున్నా.. వారిద్దరూ మాత్రం పెదవి విప్పడం లేదు.

    English summary
    Malaika arora posted a bhujangasanam picture. And tells uses of it. Malaika pose and picture goes viral. Her boyfriend arjun kapoor also liked her post in instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X