For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ భర్త టచ్‌లో ప్రముఖ నటి: స్టార్ హీరోతో ఎఫైర్‌పై షాకింగ్‌గా.. పెళ్లి కాకున్నా అలా చేస్తామంటూ!

  |

  దేశంలోని మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో లవ్ ట్రాకులు, డేటింగ్‌లు, బ్రేకప్‌లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణమైన అంశాలు అని చెప్పొచ్చు. అందుకే వీటి వల్ల చాలా మంది నటీనటులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు. అయితే, గతంలో భర్తతో విడిపోయిన ఓ బ్యూటీ మళ్లీ అతడితో టచ్‌లో ఉందన్న వార్త బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

  ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ ఐటెం గర్ల్ మలైకా అరోరా. అప్పుడెప్పుడో విడాకులు తీసుకున్న ఈ భామ.. ఇప్పుడు స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా మలైకా తన మాజీ భర్త గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అలా వచ్చి.. ఇలా పాపులర్

  అలా వచ్చి.. ఇలా పాపులర్

  మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ పాపులర్ అయింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌'లో స్పెషల్ సాంగ్స్‌ చేసి సుపరిచితురాలు అయింది.

  డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

  అర్భాజ్‌తో పెళ్లి విడాకులు

  అర్భాజ్‌తో పెళ్లి విడాకులు

  సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పట్లో ఈ న్యూస్ బాగా హైలైట్ అయింది.

  అర్జున్ కపూర్‌తో లవ్ ట్రాక్

  అర్జున్ కపూర్‌తో లవ్ ట్రాక్

  అర్భాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అవుతోంది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  మాజీ భర్త గురించి మలైకా

  మాజీ భర్త గురించి మలైకా

  తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు మాజీ భర్తతో టచ్‌లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికామె 'జీవితంలో సంతోషం వెతుక్కోవాలన్న ఉద్దేశంతోనే అర్బాజ్, నేను విడిపోయాం. అతడు చాలా మంచి వ్యక్తి. తను బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటున్నాను. ఇప్పటికీ మేమిద్దరం మా అబ్బాయి కోసం కలుస్తుంటాము' అని చెప్పుకొచ్చింది.

  పెళ్లి గురించి ఎమోషనల్

  పెళ్లి గురించి ఎమోషనల్

  ఇదే ఇంటర్వ్యూలో మలైకాను పెళ్లి గురించి ప్రశ్నించగా.. 'వివాహం అనేది జీవితంలో ఓ అద్భుతమైన అనుభవం. ఇది ఒత్తిడి చేయడం వల్ల జరిగే సంఘటన మాత్రం కాదు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తుంటారు. కానీ, ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోండి. సరైన వ్యక్తి మన జీవితంలోకి వస్తేనే మాత్రం మన సంతోషంగా ఉంటాం' అంటూ ఎమోషనల్ అయింది.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  అర్జున్ కపూర్‌పై స్పెషల్

  అర్జున్ కపూర్‌పై స్పెషల్

  తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్‌తో డేటింగ్ గురించి మలైకాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికామె 'మీరు మీ స్నేహితుడిని లవ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అర్జున్ కపూర్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. మేమిద్దరూ సమన్వయంతో ఉంటాం. అర్జున్ నాకు ప్రియుడే కాదు.. మంచి స్నేహితుడు కూడా. తనతో ఉంటే ప్రపంచ తెలీదు' అంటూ వెల్లడించింది.

   పెళ్లి కాకున్నా అలాగేనని

  పెళ్లి కాకున్నా అలాగేనని

  ఆ తర్వాత మలైకా అరోరా మాట్లాడుతూ.. 'నేను అర్జున్‌తో ఏదైనా మాట్లాడగలను. ఏ విషయం మీదైనా అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పగలను. అంతలా మాకు సెట్ అయింది. రిలేషన్‌షిప్‌లో ఉండడం అంటే భార్యభర్తలుగా ఉండడమే. అయితే, ఇక్కడ పెళ్లి మాత్రమే కాదు. కానీ, భాగస్వాముల్లానే ఉండగలం. మేమిద్దరం ఇప్పుడదే చేస్తున్నాం. ఇక మా పెళ్లి అనేది ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను' అని తెలిపింది.

  English summary
  Bollywood Actress Malaika Arora Took Divorce with Arbaaz Khan. Now She Gave Clarity about Relation with her Ex Husband.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X